ప్రపంచ నైపుణ్య పోటీలకు ఏపీ రాష్ట్ర అభ్యర్థులు!
Sakshi Education
సాక్షి, అమరావతి: చైనాలోని షాంఘై నగరంలో 2021 సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ స్థాయి వృత్తి నైపుణ్య పోటీలకు అభ్యర్థులను పంపించాలని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్ణయించింది.
వివిధ వృత్తుల్లో నైపుణ్యం గల వారిని ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహించనుంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్కిల్ ఇండియా సహకారంతో దేశీయంగా పోటీలు నిర్వహిస్తోంది. 27 విభాగాల్లో జరిగే నైపుణ్య పోటీలకు దరఖాస్తులను ఆహ్వానించగా 17 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి తొలుత జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి పోటీలు 20 నుంచి ఫిబ్రవరి 5వ వరకు జరిపి.. ఒక్కో విభాగంలోంచి ఐదుగుర్ని ఎంపిక చేస్తారు. వీరికి వచ్చే నెల 17 నుంచి మార్చి 3 వరకు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చినవారికి మార్చి 26, 27న విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయి. విజేతలకు 3 వారాల పాటు శిక్షణ ఇప్పిస్తారు. మే నుంచి జూలై వరకు జరిగే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటిన అభ్యర్థులు చైనాలో జరిగే పోటీల్లో పాల్గొంటారు.
27 ట్రేడ్‌లలో పోటీలు..: ఆటో బాడీ రిపేర్, ఆటోమొబైల్ టెక్నాలజీ, బ్యూటీథెరపీ, కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ వర్క్, ఎన్‌సీ మిల్లింగ్, సీఎన్‌సీ టర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్టలేషన్‌స, గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ, ఐటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌స ఫర్ బిజినెస్, ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, జ్యువెలరీ, ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ క్యాడ్, మెకట్రానిక్స్ వంటి వృత్తి విభాగాల్లో పోటీలు ఉంటాయి.

Published date : 28 Jan 2020 02:44PM