నిట్‌కు సెలవులు పొడిగింపు
Sakshi Education
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి సెలవులను ఈనెల 14వ తేదీ వరకు పొడిగించారు.
నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్‌రావు ఏప్రిల్ 3 (శుక్రవారం)న ఈ విషయాన్ని వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఈనెల 4వ తేదీ వరకే సెలవులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర సేవలు మినహాయించి ఈనెల 14 వరకు సెలవులను పొడిగించామని తెలిపారు.
Published date : 04 Apr 2020 01:05PM