మునిసిపల్ స్కూళ్లలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మునిసిపల్ స్కూళ్లు ఈ–లెర్నింగ్ బాట పట్టనున్నాయి.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులను విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే రీతిలో ఇతర తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలో బోధన చేసేందుకు సమాయత్తమవుతోంది.
కోవిడ్ తరువాత కూడా..
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లోనే కాకుండా ఆ తరువాత కూడా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను కొనసాగించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 2 వేల మునిసిపల్ స్కూళ్లలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను రెండు అంచెలుగా నిర్వహించాలన్నది పురపాలక శాఖ ఉద్దేశం. వారానికి ఒకసారి జిల్లాస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. నెలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో అదేవిధంగా పరీక్షలు జరుపుతారు. తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కోవిడ్ పరిస్థితులు తొలగిపోయి పాఠశాలలు సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా ఆన్‌లైన్ తరగతులను కొనసాగించాలని పురపాలక శాఖ భావిస్తోంది. సబ్జెక్ట్ నిపుణులతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర స్థాయిలో సబ్జెక్ట్ నిపుణులతో ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇంగ్లి‹ష్, గణితం, సైన్స్ సబ్జెక్టులకు ప్రాధాన్యమిస్తూ ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి.
త్వరలోనే ఆదేశాలు
4వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా మునిసిపల్ కమిషనర్లకు త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. ఈ–లెరి్నంగ్‌కు అవసరమైన పరికరాలను మునిసిపాలిటీలు సాధారణ నిధుల నుంచి కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తారు. పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తరువాత ఆన్‌లైన్ క్లాసుల్ని ప్రారంభిస్తామని పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’కి తెలిపారు.

Published date : 04 Jun 2021 04:06PM