క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ‘నిట్’ విద్యార్థుల హవా
Sakshi Education
కాజీపేట అర్బన్: నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో ప్రత్యేక గుర్తింపు సాధించిన వరంగల్ అర్బన్ జి ల్లా కాజీపేటలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్) విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో సత్తా చాటారు.
2019 - 20 ఏడాదికి సంబంధించి 732 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు మైక్రోసాఫ్ట్, డీఈషా, ఒరాకిల్ ఇండియా, సాప్ ల్యాబ్స్, టెక్సాస్, క్వాల్‌కాం, ఐటీసీ, గెయిల్, హెచ్‌పీసీఎల్ వంటి 177 కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరుకాగా వివిధ హోదాల్లో ఉద్యోగాలు సాధించారని నిట్ విభాగం అధికారులు ఏప్రిల్ 27న ఓ ప్రకటనలో తెలిపారు. 732 మందిలో 551 మంది బీటెక్ విద్యార్థులు, 181 మంది పీజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని.. ఉద్యోగాలు సాధించిన వారిలో 14 మంది విద్యార్థులకు వార్షిక ప్యాకేజీ రూ.43.33 లక్షలు ఉండటం విశేషం. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను నిట్ డెరైక్టర్ ఎన్.వి.రమణారావు, ప్రొఫెసర్లు అభినందించారు.
Published date : 28 Apr 2020 03:03PM