Skip to main content

కరోనా ఎఫెక్ట్: ‘ఐసీఎస్‌ఐ’ ఈ లెర్నింగ్‌కు పాధాన్యత

సాక్షి, ఎడ్యుకేషన్: ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ)... కరోనా కారణంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఈ లెర్నింగ్‌కు పాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది.
ఆ దిశగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ కోర్సులు, వీడియో లెక్చర్స్, మాక్ టెస్టులు నిర్వహిస్తోంది. ఐసీఎస్‌ఐ క్లాస్ రూం టీచింగ్‌కు నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. విద్యార్థులు ఉచిత వీడియో లెక్చర్స్‌ను https://elearning.icsi.in లో చూడొచ్చు. దీంతోపాటు ఇన్‌స్టిట్యూట్ సభ్యుల కోసం పలు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను, వెబినార్స్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.icsi.edu
Published date : 28 Apr 2020 02:37PM

Photo Stories