ఏఫ్రిల్ 15 నుంచి డిగ్రీ ఆన్‌లైన్ తరగతులు
Sakshi Education
నల్లగొండ: కరోనా నివారణ సెలవుల్లో విద్యార్ధులు నష్టపోకుండా కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏఫ్రిల్ 15 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహింస్తున్నట్లు యాదాద్రి రామన్నపేట ఐడీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య పేర్కొన్నారు.
ప్రతి అధ్యాపకుడు కళాశాల పనివేళల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించి పాఠ్యంశాలను కళాశాలల విద్యాసంచాలకులు అందుబాటులోకి తెచ్చిన గూగుల్ నెట్‌వర్క్ ద్వారా బోధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి స్మాట్‌ఫోన్ ఉంటే వినొచ్చని, ఇంటర్‌నెట్ లేనిచోట రికార్డుల ద్వారా పాఠ్యంశాలను చేరవేయవచ్చని పేర్కొన్నారు. విద్యార్ధులంత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Published date : 15 Apr 2020 06:25PM