Skip to main content

డిజిటల్ సంస్థల్లో అత్యధికంగా ఉద్యోగాలు

న్యూఢిల్లీ/దావోస్: కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో కంపెనీలు తమ డిజిటలీకరణ ప్రణాళికలను వేగవంతం చేశాయి .
ఇలా డిజిటల్ బాట పట్టిన కంపెనీలే గరిష్టంగా ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాయి . మ్యాన్‌పవర్‌గ్రూప్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి . వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దావోస్ అజెండా సదస్సులో భాగంగా ఈ నివేదికను విడుదల చేశారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, అమలు చేయడం వంటి ట్రెండ్‌‌స కరోనా కష్టకాలంలో మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. 40 పైగా దేశాలకు చెందిన 26,000 పైచిలుకు సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి . కరోనా నేపథ్యంలో డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు 38 శాతం కంపెనీలు తెలపగా, కేవలం 17 శాతం సంస్థలే తమ డిజిటల్ ప్రణాలికలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించాయి .

గ్లోబల్ దిగ్గజాల సరసన రిలయన్స్, మహీంద్రా..
అత్యున్నత కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలకు కట్టుబడి ఉండే విషయంలో 50 పైగా అంతర్జాతీయ దిగ్గజాల సరసన తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూప్ కూడా చేరాయి . దీని ప్రకారం పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ పరమైన 31 అంశాలను కంపెనీలు పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికే యాక్సెంచర్ తదితర 61 సంస్థలు దీనికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.
Published date : 28 Jan 2021 02:47PM

Photo Stories