Skip to main content

ఆన్‌లైన్ లో ఉచితంగా ఏఐ కోర్సులు

సాక్షి, అమరావ‌తి: ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్ విద్యార్ధులు లాక్‌డౌన్ కాలాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ సాఫ్ట్ వేర్‌, స‌ర్వీస్ కంపెనీస్ (నాస్కామ్‌) ప్ర‌త్యేక చొర‌వ చూపించింది.

ఐటీ రంగంలో డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ఆన్‌లైన్‌లో ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా విద్యార్ధులు, నిరుద్యోగులు త‌మ నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

  • నాస్కామ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఫ్యూచ‌ర్ స్కిల్స్‌, కేంద్ర ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ‌లు సంయుక్తంగా ఈ కోర్సును మే 15 వ‌రకు అందిస్తాయి.
  • ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న‌దిగా గుర్తింపు పొందిన ఫౌండేష‌న‌ల్ ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ కోర్సును స్కిల్ ఆఫ్ ఆన్‌లైన్‌లో విద్యార్ధులు అభ్య‌సించ‌వ‌చ్చును.
  • ఒక్కో విద్యార్ధి నుంచి రూ.6,500 ఫీజు వ‌సూలు చేసే ఈ కోర్సును ప్ర‌స్తుతం ఉచితంగా అందిస్తున్నారు.
  • ఐటీ రంగంలో గుర్తింపు పొందిన ఫౌండేష‌న బీడీఏ కోర్సును త‌మ డిజిట‌ల్ విద్య ఫ్లాట్‌ఫాం ద్వారా నాస్కామ్ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.
  • లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఐటీ విద్యార్ధులు, యువ‌త త‌మ నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని నాస్కామ్ అధ్య‌క్షుడు దెబ్జానీ ఘోష్ చెప్పారు.
Published date : 10 Apr 2020 04:35PM

Photo Stories