ఆన్‌లైన్ క్లాసులతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆన్‌లైన్ క్లాసులతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ (ఏంటీఎఫ్) అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా మూడో వేవ్ పొంచి ఉన్నందున తరగతుల నిర్వహణ మంచిది కాదని పేర్కొన్నారు. జూన్ 12 వ తేదీ నుంచి ఏప్రియల్ 24 వరకు అకడమిక్ సంవత్సరంగా పరిగణిస్తున్నందున ఈ విద్యాసంవత్సరం కూడా అదే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
Published date : 10 Jun 2021 05:04PM