Skip to main content

ఐటీఐ విద్యార్థుల తెలంగాణ ఎల్‌పీసెట్‌– 2021కు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఐ పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఎల్‌పీసెట్‌ దరఖాస్తులను శుక్రవారం నుంచి స్వీకరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఓ ప్రకటనలో తెలిపింది.
జూన్‌ 11 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను విక్రయిస్తామని, వాటిని ఈ నెల 23లోగా అందజేయాలని పేర్కొంది. దరఖాస్తుల వి వరాలను, అర్హతలను వెబ్‌సైట్‌ https://sbtet.telangana.gov.in లో పొందవచ్చని వివరించింది. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

టీఎస్‌ ఎంసెట్‌తో సహా ఇతర సెట్స్‌ అన్నీ వాయిదా.. జూలై 25 తరువాతే..
Published date : 11 Jun 2021 12:59PM

Photo Stories