ఐఐటీ మద్రాస్‌లో మరో 79 మందికి..
Sakshi Education
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐఐటీ మద్రాస్‌లో సోమవారం నాటికి మొత్తం 104 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకగా, మంగళవారం మరో 79 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఐఐటీ మద్రాసులోని హాస్టళ్లలో 700 మందికి పైగా ఉన్న విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం ఒకే రోజున 539 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 79 మంది విద్యార్థులకు మంగళవారం పాజిటివ్ నిర్ధారణైంది. వీరందరికీ చెన్నై గిండిలోని కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Published date : 16 Dec 2020 03:27PM