ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పో ఒప్పందం
Sakshi Education
సంగారెడ్డి టౌన్: ప్రముఖ సెల్‌ఫోన్ సంస్థ ఒప్పో - హైదరాబాద్ ఐఐటీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
ఒప్పో సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ముందుకొచ్చింది. కెమెరా, ఇమేజ్ ప్రాసెసింగ్, బ్యాటరీ, నెట్‌వర్క్ (5జీ) రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, సిస్టమ్ పర్ఫార్మెన్‌స, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స తదితర అంశాలపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు చేయనున్నట్లు ఐఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ఎస్. చెన్నప్పయ్య, ఒప్పో వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ తస్లీమ్ తెలిపారు.
Published date : 28 Jan 2020 02:51PM