46 పాలిటెక్నిక్ కాలేజీల్లో 100% సీట్లు భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో 3,069 మందికి కొత్తగా సీట్లు లభించాయి.
పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం రెండోదశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ ప్రకటించింది. రాష్ట్రంలోని 132 పాలిటెక్నిక్ కాలేజీల్లో 31,792 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి, చివరి దశ కౌన్సెలింగ్‌లో కలిపి 21,590 సీట్లు (67.91 శాతం) భర్తీ అయ్యాయి. మిగతా 10,202 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక రెండుదశల కౌన్సెలింగ్ తరువాత 40 ప్రభుత్వ కాలేజీలు, 6 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 6వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, 7వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని కమిటీ వివరించింది. 7 నుంచి 14వ తేదీ వరకు ఓరియెంటేషన్ కార్యక్రమం, 15వ తేదీనుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొంది.
Published date : 05 Oct 2020 03:38PM