107వ సైన్స్ కాంగ్రెస్‌కు బెంగళూరు సిద్ధం
Sakshi Education
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో దేశానికి దిక్సూచిగా చెప్పుకోదగ్గ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఉద్యాననగరి బెంగళూరు సిద్ధమైంది.
జనవరి 3 నుంచి 7 వరకు స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 106 ఏళ్లుగా నడుస్తున్న ఈ కార్యక్రమం బెంగళూరులో జరగనుండటం ఇది తొమ్మిదవ సారి. దేశంలో వ్యవసాయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ 107వ సైన్స్ కాంగ్రెస్ మొత్తాన్ని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు-గ్రామీణాభివృద్ధి అన్న అంశంపై నిర్వహించనుండటం విశేషం.
Published date : 03 Jan 2020 03:19PM