Skip to main content

September 17, 18 Schools & Colleges Holidays : వినాయక చవితికి సెల‌వు ఆ రోజే.. స్కూల్స్, కాలేజీల‌కు వ‌రుస‌గా రెండు రోజులు హాలిడేస్..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల వ‌ర్షం కురుస్తుంది. ఒక వైపు వాన‌లు.., మ‌రో వైపు పండ‌గ సెల‌వులతో స్కూల్స్‌, కాలేజీ విద్యార్థులు సెల‌వుల‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Rain and festivals,Vinayaka Chavithi Holidays for School and Colleges Telugu News, Festive holiday season
Vinayaka Chavithi Holidays for School and Colleges

ఇప్పుడు తాజాగా వినాయ‌క చ‌వితి పండ‌గ రూపంలో మ‌రో రోజు స్కూల్స్‌, కాలేజీల‌కు ప్ర‌భుత్వం సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం.. ముఖ్య‌మైన పండ‌గ‌ల్లో గణేష్ చతుర్థి ఒకటి. అయితే.. ఈ ఏడాది పండుగ తేదీ విషయంలో ఓ సందేహం మొదలైంది.

☛ AP Schools & Colleges Dussehra Holidays 2023 : ఆంధ్ర‌ప్రదేశ్‌లో దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

ఈ ఏడాది సెప్టెంబర్ 18, 19వ తేదీలలో చతుర్థి వచ్చింది. దీంతో కొందరు సెప్టెంబర్ 18 సోమవారం నాడు వినాయక చవితి జరుపుకోవాలని.. మరికొందరు సెప్టెంబర్‌ 19వ తేదీ మంగళవారం జరుపుకోవాలని చెబుతున్నారు. దీంతో మరోసారి అందరిలోనూ సందిగ్ధత నెలకొంది.కాణిపాకం, తిరుమల పండితులతో పాటు ఇతర పూజారులు కూడా ఇప్పటికే పలు వేదికలపై వినాయక చవితి పండుగ తేదీపై స్పష్టత ఇచ్చారు.

vinayaka chavithi holidays school and colleges holidays news telugu

సెప్టెంబ‌ర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటల వరకు తదియ తిథి ఉంటుందని.. ఆ తర్వాత చతుర్థి తిథి సెప్టెంబర్ 18న సోమవారం నాడు ప్రారంభమై.. మరుసటి రోజు 19 సెప్టెంబర్ 2023 రాత్రి 8:43 గంటలకు ముగియనుంది. ఉదయం తిథి ప్రకారం అయితే.. గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 19వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది.

☛ School & Colleges Holiday list in September 2023 : సెప్టెంబ‌ర్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

మరోవైపు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం మాత్రం సెప్టెంబర్ 18వ తేదీనే వినాయక చవితి అని క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచే 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు కూడా. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పలు కాలనీల్లో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్ 18వ తేదీనే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

school holidays news

అలాగే.. భాగ్యనగర కమిటీ కూడా సెప్టెంబర్‌ 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో.. హైదరాబాద్‌లో కూడా సెప్టెంబర్ 18నే వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. దీని ప్ర‌కారంగానే కాలేజీల‌కు, స్కూల్స్ సెప్టెంబ‌ర్ 18వ తేదీ (సోమ‌వారం) విద్యాశాఖ సెల‌వును ప్ర‌క‌టించింది. అలాగే సెప్టెంబ‌ర్ 17వ తేదీ ఆదివారం కావ‌డంతో.. వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి.

☛ Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

 

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

schools holidays list 2023-24 news telugu

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

 

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

Published date : 16 Sep 2023 02:29PM

Photo Stories