Skip to main content

ALP Preparation: అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ ఇలా..

రైల్వే శాఖలో ఉద్యోగం ఆశిస్తున్నారా? అయితే ఇది మీకో సువర్ణావకాశం! భారత రైల్వే శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) తాజాగా 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి/ITI/డిప్లొమా/ఇంజనీరింగ్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
RRB ALP Recruitment 2025 Notification   Apply Online for 9970 ALP Posts  Railway ALP Eligibility Details  railway-jobs/education-news/rrb-technician-recruitment-2024-notification-preparation-guidance-exam-success-151855

జాబ్ పేరు: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)

ఖాళీలు: మొత్తం 9,970 పోస్టులు

ఆర్‌ఆర్‌బీ-సికింద్రాబాద్ ఖాళీలు: 1,500 (దక్షిణ మధ్య రైల్వేలో 967, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 533)

అర్హత: ITI లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌ డిప్లొమా లేదా బీటెక్‌

వయస్సు: 18–30 సంవత్సరాలు (SC/ST/OBCకు వయో సడలింపు వర్తింపు)

దరఖాస్తు సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం

చివరి తేదీ: మే 11, 2025

సవరణకు అవకాశం: మే 14 – మే 23

అధికారిక వెబ్‌సైట్: www.rrbsecunderabad.gov.in

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

RRB ALP ఎంపిక ప్రక్రియ – మూడు దశలు

CBT-1 పరీక్ష:

  • మొత్తం 75 ప్రశ్నలు (మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్, సైన్స్, మెంటల్ అబిలిటీ)
  • వ్యవధి: 60 నిమిషాలు
  • భాషలు: తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌ తదితర 13 ప్రాంతీయ భాషలు
  • నెగటివ్ మార్కింగ్ ఉంది (ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గింపు)

CBT-2 పరీక్ష:

  • Part-A: 100 ప్రశ్నలు – మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ & ఇంజనీరింగ్
  • Part-B: 75 ప్రశ్నలు – సంబంధిత ITI ట్రేడ్ ఆధారంగా
  • Part-B కేవలం అర్హత పరీక్ష మాత్రమే
  • నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది

CBAT (Computer Based Aptitude Test):

  • సైకో మ్యాట్రిక్ టెస్టులు, రీజనింగ్, పరిశీలన పరీక్షలు
  • ప్రతి టెస్టులో కనీసం 42 మార్కులు రావాలి
  • భాష: ఇంగ్లీష్ లేదా హిందీ

తుది ఎంపిక & జీతం
ఫైనల్ మెరిట్ లిస్టు:

  • CBT-2 Part A మార్కులకు 70% వెయిటేజ్
  • CBAT మార్కులకు 30% వెయిటేజ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామకం
  • జీతం (Pay Level-2): ₹19,900 – ₹34,500
  • నికర వేతనం సుమారు ₹35,000

పరీక్ష ప్రిపరేషన్ టిప్స్

మ్యాథ్స్: నంబర్ సిస్టమ్, టైం & డిస్టెన్స్, ప్రాఫిట్ & లాస్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ

రీజనింగ్: కోడింగ్–డీకోడింగ్, సిరీస్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్

జనరల్ అవేర్‌నెస్: కరెంట్ అఫైర్స్, భారత చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సైన్స్ & టెక్నాలజీ

సైన్స్: పదో తరగతి స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బేసిక్ కాన్సెప్ట్స్

Published date : 23 Apr 2025 08:35AM

Photo Stories