Skip to main content

వీఐటీ బీటెక్‌–2021 ఎంట్రెన్స్‌ ఫలితాలు విడుదల

వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ పరిధిలోని వేలూరు, చెన్నై, భోపాల్, అమరావతి క్యాంపస్‌లలో బీటెక్‌–2021 ప్రవేశాలకు నిర్వహించిన ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వీఐటీ చాన్సలర్‌ విశ్వనాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ‘వీఐటీ.ఏసీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. దుబాయ్, కువైట్, మస్కట్, ఖతార్, సింగపూర్, మారిషస్‌ తదితరì 15 దేశాలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు రాశారని, ర్యాంకుల ఆధారంగా ఈ నెల 21 నుంచి జూలై 16వ తేదీ వరకు నాలుగు దశలుగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. వీఐటీ ప్రవేశ పరీక్షలో 50లోపు ర్యాంకు సాధించిన వారికి 100 శాతం ట్యూషన్‌ ఫీజు రాయితీ, 51 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం ట్యూషన్‌ ఫీజు రాయితీ కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన వారికి వీఐటీ జీవీ పాఠశాల ఆధ్వర్యంలో నాలుగేళ్ల పాటు ఉచితంగా ఇంజనీరింగ్‌ విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్‌ సిటీ పథకం కింద పూర్తి ఉచితంగా ఇంజనీరింగ్‌ విద్యను అందజేయనున్నట్లు తెలిపారు.
Published date : 14 Jun 2021 07:09PM

Photo Stories