Skip to main content

ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

లబ్బీపేట(విజయవాడతూర్పు) : డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించిన ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది కాంపిటెన్సీ(సప్లిమెంటరీ) పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసింది.
ఎంసీఐ, హెల్త్‌ యూనివర్సిటీ నిబంధనల మేరకు గ్రేస్‌ మార్క్స్‌ కలిపిన తర్వాత ఫలితాలు విడుదల చేసినట్టు వర్సిటీ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ పి.దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ ఫలితాలపై రీ టోటలింగ్‌ కోరే విద్యార్థులు జూలై 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వర్సిటీ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడొచ్చని పేర్కొన్నారు.
Published date : 25 Jun 2021 04:35PM

Photo Stories