Polycet 2023: ప్రశాంతంగా పాలిసెట్–2023.. ప్రాథమిక ‘కీ’ సమాచారం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిసెట్–2023 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రవేశ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1,43,592 (89.56 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.
ప్రాథమిక ‘కీ’ని మే 13న, ఫైనల్ ‘కీ’ని మే 16 లేదా 17న విడుదల చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ‘కీ’ http:// sbtetap.gov.in వెబ్ సైట్లో ఉంటుందన్నారు. పది రోజుల్లో ఫలితాలను విడుదల చేసి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు.
చదవండి: Polycet: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఫ్రీగా పాలీసెట్ కోచింగ్.. పూర్తి వివరాలు ఇవే
కాగా, సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ విజయవాడలోని మేరీస్ స్టెల్లా, పటమట బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాల్లో, కమిషనర్ నాగరాణి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
చదవండి: AP Polycet 2023: ఏపీ పాలీసెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే..
Published date : 11 May 2023 03:49PM