Skip to main content

AP Polycet Results: పాలిసెట్ ఫలితాలు మే 12న విడుదల.. ఫ‌లితాలు ఇలా చెక్‌ చేసుకోవాలి!

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ (AP POLYCET) 2025 పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఫలితాలపై భారీ ఉత్కంఠ నెలకొంది.
Andhra Pradesh Polycet results to be released on May 12

ఏప్రిల్ 30న పరీక్షలు జరిగాక, విద్యార్థులు తమ ర్యాంక్‌లు, తద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం సాధించే అవకాశాల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. వారి ఈ నిరీక్షణకు తెరదిస్తూ మే 12న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు  అధికారులు తెలిపారు.

పాలిసెట్ ఫలితాలను polycetap.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తనిఖీ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం ఆయా ర్యాంకుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. కౌన్సెలింగ్, సీటు అలాట్‌మెంట్ తదితర ప్రక్రియల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

చదవండి: 9,970 Railway Jobs: అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) ఉద్యోగాల దరఖాస్తు గ‌డువు పెంపు!

AP POLYCET Result 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

  • ముందుగా www.sakshieducation.com లేదా https://results.sakshieducation.comను క్లిక్‌చేయండి. 
  • హోంపేజీపై కనిపిస్తోన్న AP POLYCET Result 2025 లింక్‌ను క్లిక్‌ చేయండి. 
  • మీ హాల్‌టికెట్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వంటి వివరాలను ఎంటర్‌చేయండి.
  • తర్వాతి స్క్రీన్‌పై ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకొని సేవ్‌ చేసుకోండి. 
Published date : 10 May 2025 05:20PM

Photo Stories