Skip to main content

నిట్, ఏపీలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు
మొత్తం సీట్ల సంఖ్య: 60
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌/యూనివర్సిటీ నుంచి కనీసం 60శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది/ సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వాలిడ్‌ క్యాట్‌/సీమ్యాట్‌/మ్యాట్‌/జీమ్యాట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/సీమ్యాట్‌/మ్యాట్‌/జీమ్యాట్‌/ఏదైనా ఇతర జాతీయ అర్హత పరీక్షల స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్స్‌(జీడీ)/పర్సనల్‌ ఇంటర్వూ్య నిర్వహించి ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nitandhra.ac.in

Photo Stories