Skip to main content

నవోదయ విద్యాలయ సమితిలో ఇంటర్‌ ప్రవేశాలు..పూర్తి వివరాలు ఇలా

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

గ్రూప్‌లు: మ్యాథమేటిక్స్‌తో సైన్స్, మ్యాథమేటిక్స్‌ లేకుండా సైన్స్, మ్యాథమేటిక్స్‌తో కామర్స్, మ్యాథమేటిక్స్‌ లేకుండా కామర్స్‌.
అర్హత: పదో తరగతి(సీబీఎస్‌ఈ/స్టేట్‌ ఎడ్యుకేషన్‌/ఇతర గుర్తింపు పొందిన బోర్డులు) ఉత్తీర్ణులవ్వాలి. ఎన్‌సీసీ, స్కౌట్‌ అండ్‌ గైడ్స్, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అభ్యర్థులకు అదనపు వెయిటేజి లభిస్తుంది.
వయసు: 01.06.2003 నుంచి 31.05.2007 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in

Photo Stories