Skip to main content

నీట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు వివరాలు ఇలా..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–2021
అర్హతలు:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియెట్‌/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 17ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష విధానం: పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో మొత్తం 180 ప్రశ్నలు–720 మార్కులకు నీట్‌ పరీక్ష జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్‌లు.. సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బీ ఉంటాయి. సెక్షన్‌ ఏలో 35 ప్రశ్నలు–140 మార్కులు, సెక్షన్‌ బీలో 15 ప్రశ్నలు–40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సెక్షన్‌ బీలోని 15 ప్రశ్నల్లో ఏవైనా పదింటిని అటెంప్ట్‌ చేస్తే సరిపోతుంది. అంటే.. ఫిజిక్స్‌లో 45 ప్రశ్నలు–180 మార్కులు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు–180 మార్కులు, బాటనీ 45 ప్రశ్నలు–180 మార్కులు, జువాలజీ 45 ప్రశ్నలు–180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 13.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 06.8.2021

పరీక్ష తేది: 12 సెప్టెంబర్‌ 2021(ఆదివారం)
పరీక్ష సమయం: మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు;

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://neet.nta.nic.in

Photo Stories