Skip to main content

మ్యాట్-2020 (డిసెంబర్) నోటిఫికేషన్

దేశంలోని బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ఎంబీఏ కోర్సులో చేరేందుకు ఉద్దేశించిన ‘మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్-2020 డిసెంబర్‌కు)కు నోటిఫికేషన్ వెలువడింది.

మ్యాట్ దేశవ్యాప్తంగా ఏటా నాలుగుసార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో జరుగుతుంది. దీన్ని ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా మ్యాట్ 2020 డిసెంబర్ నిబంధనల్లో మార్పులు చేశారు. కొత్తగా ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(ఐబీటీ)ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
600కు పైగా బీ-స్కూల్స్‌లో ప్రవేశం: ఏటా ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో నాలుగుసార్లు జరిగే మ్యాట్‌కు సంబంధించి ఏ సెషన్‌లో ఎంట్రన్‌‌స రాసినా.. ఆ స్కోరు ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ స్కోరు ఆధారంగా దేశంలోని దాదాపు 600కు పైగా బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో ప్రవేశం పొందవచ్చు.
అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హతతో మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: మ్యాట్-2020 ఏటా నాలుగుసార్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)తోపాటు పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ) విధానంలోనూ నిర్వహిస్తారు. కొవిడ్-19 నేనథ్యంలో ఈ ఏడాది మ్యాట్‌ను ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(ఐబీటీ) మోడ్‌లో కూడా నిర్వహించను న్నారు. ఈ సంవత్సరానికి ఎంట్రన్‌‌సలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మోడ్‌ను నిలిపివేశారు. డిసెంబర్ సెషన్‌లో ‘ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్’(ఐబీటీ) విధానంలో టెస్ట్‌కు నవంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్/పేపర్ బేస్డ్ టెస్ట్ ఫీజు రూ.1650.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
హాల్ టికెట్ల జారీ: డిసెంబర్ 1 నుంచి
ఎంట్రన్‌‌స టెస్ట్ తేది : డిసెంబర్ 6,2020
దరఖాస్తు ఫీజు:

  • ఇంటర్నెట్/ పేపర్ బేస్డ్ టెస్ట్ ఫీజు: రూ.1650
  • రెండు ఐబీటీ మోడ్‌‌స టెస్టులు రాయాలనుకుంటే: రూ.2750 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 29, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://mat.aima.in

Photo Stories