Skip to main content

కొచ్చిన్‌ షిష్‌యార్డ్‌ లిమిటెడ్‌– ఎంఈటీఐలో జీఎంఈటీ ప్రవేశాలు.. చివరి తేది ఫిబ్రవరి 10

కొచ్చిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ కొచ్చిన్ షిష్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్‌ఎల్)కి చెందిన మెరైన్ ఇంజనీరింగ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఈ టీఐ).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి.. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ట్రెయినింగ్ (జీఎం ఈటీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు వ్యవధి: 12 నెలలు 
సీట్ల సంఖ్య: 114.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో మెకానికల్/మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్/నావల్ ఆర్కిటెక్చర్/నావల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.03.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఎంఎంపీఈ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని..పూర్తిగా నింపి, సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి.. హెచ్‌ఓడీ, ఎంఈటీఐ, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, కొచ్చి చిరునామాకి స్పీడ్ పోస్టు/ఈమెయిల్ ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 10, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.cochinshipyard.com

Photo Stories