Skip to main content

జీప్యాట్-2021 నోటిఫికేషన్

2020-21 విద్యా సంవత్స రానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టి ట్యూడ్ టెస్ట్(జీప్యాట్)-2021 ప్రకటనను విడుదలచేసింది. దీనిద్వారా ఎంఫార్మా/ తత్సమాన కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
అర్హత: ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణలవ్వాలి. బీఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ (ఫార్మస్యూటికల్, ఫైన్ కెమికల్ టెక్నాలజీ)/తత్సమాన అభ్యర్థులు దీనికి అర్హులు కాదు. జీప్యాట్- 2021 దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: 2020-21 విద్యా సంవత్సరానికి మాస్టర్స్(ఎంఫార్మా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో వివిధ విభాగాలు ఉంటాయి. ఇందులో 125 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 500 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్ చేస్తారు.
  • ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ-38 ప్రశ్నలు-152 మార్కులు
  • ఫార్మస్యూటిక్స్-38 ప్రశ్నలు-152 మార్కులు
  • ఫార్మకాగ్నసీ-10 ప్రశ్నలు-40 మార్కులు
  • ఫార్మకాలజీ-28 ప్రశ్నలు-112 మార్కులు
  • ఇతర సబ్జెక్టులు-11 ప్రశ్నలు-44 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 22, 2021.
పరీక్ష తేది: ఫిబ్రవరి 22/27, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://gpat.nta.nic.in/ www.nta.ac.in

Photo Stories