Skip to main content

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఎంఎఫ్‌ఏ-2020 ప్రవేశాలు

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు, సీట్ల సంఖ్య: అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ -20, ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్-15, పెయింటింగ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్-15, స్కల్ప్‌చర్-06
అర్హత: సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సుల కాల వ్యవధి: రెండేళ్లు
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షా ద్వారా ఎంపిక జరుగుతుంది. సంబంధిత కోర్సును అనుసరించి వివిధ పద్ధతుల్లో పరీక్షా విధానం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కోఆర్డినేటర్ అడ్మిషన్స్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్-500028 అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఇతరులకు రూ.2000/-

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 28, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.jnafau.ac.in

Photo Stories