ఇండియన్ ఆర్మీ–బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో 2021 ప్రవేశాలు
2021 సంవత్సరానికి ఇండియన్ ఆర్మీ.. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో పర్మనెంట్/షార్ట్ సర్వీస్ కమిష¯Œన్‌లో ఉద్యోగం కల్పిస్తారు.
వివరాలు:
కోర్సు వివరాలు: నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులకు తగ్గకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ – జువాలజీ), ఇంగ్లిష్ సబ్జెక్టులతో మొదటి ప్రయత్నంలోనే ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహిత/విడాకులు/లీగల్‌గా విడిపోయిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01 అక్టోబరు 1996–30 సెప్టెంబరు 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు పిలుస్తారు. ఈ పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. దీన్ని ఏప్రిల్ 2021లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను జూన్ 2021లో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. దీనిలో అర్హత సాధించిన వారికి మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 10, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindianarmy.nic.in.