Skip to main content

ఇగ్నోలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు – 2021 ఫిబ్రవరి నోటిఫికేషన్‌

దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్న ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనవర్సిటీ (ఇగ్నో)..2021– 22 విద్యాసంవత్సరానికిగాను అండర్‌ గ్రాడ్యుయేషన్‌, బీఈడీ, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ, డిప్లొమా, సర్టిఫికెట్, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏటా జనవరి, జూలై నెలల్లో రెండుసార్లు అడ్మిషన్‌ ప్రక్రియ చేపడుతుంది.

వివరాలు:
కోర్సులు అందిస్తున్న విభాగాలు: ఇగ్నో పరిధిలోని స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌, స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, స్కూల్‌ ఆఫ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్, స్కూల్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ సర్వీస్‌ మేనేజ్‌మెంట్, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ వంటి దాదాపు 21 విభాగాల నుంచి వందల సంఖ్యలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు.

మాస్టర్స్‌ కోర్సులు: ఎంఏ–ఫిలాసఫీ/ఎకనామిక్స్‌/ ఇంగ్లిష్‌/హిందీ/పొలిటికల్‌ సైన్స్‌/పబ్లిక్‌ అడ్మిని స్ట్రేషన్‌/సోషియాలజీ/టూరిజం మేనేజ్‌మెంట్‌/ ఎంబీఏ/ఎంసీఏ/ఎంకామ్‌/ ఎంకామ్‌ – బిజినెస్‌ పాలసీ అండ్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌/ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌/ఎంఎల్‌ఐఎస్‌/ఎంఎస్‌డబ్లు్య/ఎంఎస్సీ–కంప్యూటర్‌ సైన్స్‌ వంటి కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. వీటితోపాటు ఎమ్మెస్సీ డైటెటిక్స్‌ అండ్‌ ఫుడ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌/ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌/ఎమ్మెస్సీ కౌన్సెలింగ్‌ అండ్‌ ఫ్యామిలీ థెరఫీ/మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌/ఎంఏ సోషల్‌వర్క్‌/ఎంఏ సోషల్‌వర్క్‌ కౌన్సెలింగ్‌/ఎంఏ ఎడ్యుకేషన్‌/ఎంఏ సైకాలజీ/ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ వంటి కోర్సులకు డిమాండ్‌ ఉంది.
అర్హతలు: కనీస అర్హత డిగ్రీ. సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు బీఎస్సీ డిగ్రీ ఉండాలి.

యూజీ కోర్సులు:
ఇగ్నో జనరల్‌ బీఏ/బీకామ్‌/బీఎస్సీ డిగ్రీలతో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎస్‌ఐఎస్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (బీఎస్‌డబ్ల్యూ), బీఏ టూరిజం స్టడీస్, బీఎస్సీ నర్సింగ్, బీఈడీ, బీసీఏ, బీబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది. వీటితోపాటు పలు విభాగాల్లో హానర్స్‌ డిగ్రీ కోర్సులను సైతం అందిస్తోంది. ఆయా కోర్సుల్లో మొదటి సంవత్సరం పూర్తి చేస్తే డిప్లొమా; రెండో ఏడాది కోర్సు పూర్తిచేస్తే అడ్వా్సడ్‌ డిప్లొమా; మూడో ఏడాది పూర్తిచేస్తే డిగ్రీ పట్టా అందిస్తారు.
అర్హతలు: ఇంటర్మీడియెట్‌/10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: https://ignouadmission.samarth.edu.in
పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: http://ignou.ac.in

Photo Stories