హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రవేశాలకు హెచ్‌ఎస్‌ఈఈ–2021 నోటిఫికేషన్
ఐఐటీలు.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ కోర్సులనే కాదు.. హ్యుమానిటీస్ కోర్సులను సైతం అందిస్తున్నాయి.
సంప్రదాయ కోర్సులకు ఆధునికత జోడించి.. ఉన్నత ప్రమాణాలతో ఆయా కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో అగ్రగామి విద్యాసంస్థగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మద్రాస్ (ఐఐటీ–ఎం).. హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘హెచ్‌ఎస్‌ఈఈ–2021’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో... అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
‘హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (హెచ్‌ఎస్‌ఈఈ) 2021
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇంగ్లిష్ స్టడీస్, ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్’కోర్సులు
అర్హతలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: మార్చి 15, 2021.
ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహణ తేది: జూన్ 13, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://hsee.iitm.ac.in
వివరాలు:
‘హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (హెచ్‌ఎస్‌ఈఈ) 2021
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇంగ్లిష్ స్టడీస్, ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్’కోర్సులు
అర్హతలు:
- ‘హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (హెచ్‌ఎస్‌ఈఈ)–2021 ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలురాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాయింట్ సర్వీసెస్ వింగ్ చివరి సంవత్సరం పాసైనవారు, చివరి సంవత్సరం చదువుతున్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా కనీసం ఐదు సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్/తత్సమానమైన కోర్సు ఉత్తీర్ణులు కూడా అర్హులే.
- ఇంటర్మీడియెట్‌లో జనరల్, ఓబీసీ విద్యార్థులకు 60 శాతం మార్కులు తప్పనిసరి. రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. వయసు: 1 అక్టోబర్ 1996 లేదా ఈ తేదీ తర్వాత పుట్టినవారు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎస్సీ/ఎస్టీ/ వికలాంగ విద్యార్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది. పరీక్ష విధానం: హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2021ను రెండు విభాగాలు (పార్ట్–1 అండ్ 2)గా నిర్వహిస్తారు. పార్ట్–1లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీనిని 150 నిమిషాల్లో(2.30 గంటలు) పూర్తి చేయాలి. పార్ట్–2లో జనరల్ ఎస్సేను 30 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. పార్ట్–1 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 144 మార్కులకు ఉంటే.. పార్ట్–2 ఎస్సే రైటింగ్‌కు 30 మార్కులు కేటాయించారు. గతేడాది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున ఇవ్వగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: మార్చి 15, 2021.
ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహణ తేది: జూన్ 13, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://hsee.iitm.ac.in