ఎస్‌వీవీయూ - తిరుపతిలో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(ఎస్‌వీవీయూ).. మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
దరఖాస్తు విధానం: దరఖాస్తును సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని.. సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి.. రిజిస్ట్రార్, ఎస్‌వీవీయూ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డా.వై.ఎస్.ఆర్.భవన్, తిరుపతి-517502, ఆంధ్రప్రదేశ్ చిరునామాకి పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 23, 2021.
ప్రవేశ పరీక్ష తేది: జనవరి 30, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.svvu.edu.in
- మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కోర్సులు (ఎంఎఫ్‌ఎస్సీ)
అర్హత: రాష్ట్ర అగ్రికల్చరల్/వెటర్నరీ/ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్‌ఎస్సీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 03.02.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గత అకడమిక్ రికార్డులు(30 శాతం), బీఎఫ్‌ఎస్సీ డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష (70 శాతం)లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐకార్ మార్గదర్శకాలను అనుసరించి పీజీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో దాదాపు అన్ని సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనిలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులే ఈ ప్రవేశానికి అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన ఏమీ లేదు.
- పీహెచ్‌డీ (ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)
అర్హత: ఎంఎఫ్‌ఎస్సీ(ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 03.02.2021 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.100 మార్కులకు వెయిటేజీ కింది విధంగా ఉంటుంది. ప్రవేశ పరీక్షకు 50 మార్కులు; ఎంఎఫ్‌ఎస్సీ లెవల్‌కు 20 మార్కులు; బీఎఫ్‌ఎస్సీ లెవల్‌కు 10 మార్కులు; ఇంటర్వ్యూలో ప్రతిభకు 20 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని.. సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి.. రిజిస్ట్రార్, ఎస్‌వీవీయూ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డా.వై.ఎస్.ఆర్.భవన్, తిరుపతి-517502, ఆంధ్రప్రదేశ్ చిరునామాకి పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 23, 2021.
ప్రవేశ పరీక్ష తేది: జనవరి 30, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.svvu.edu.in