Skip to main content

ఎస్‌కేయూసెట్‌కి అప్లై చేయడానికి అర్హతలు ఇవే..

శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం(అనంతపురం) పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఎస్‌కేయూసెట్ 2020లో ర్యాంకు ఆధారంగా యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

అందిస్తున్న కోర్సులు
యూనివర్సిటీ పలు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సులను అందిస్తోంది. అన్ని పీజీ కోర్సులు రెండేళ్ల కాలపరిమితితో సెమిస్టర్ విధానంలో నిర్వహిస్తారు.

  • కోర్సులు: ఎంఏలో అడల్ట్ ఎడ్యుకేషన్/ అప్లయిడ్ ఎకనామిక్స్/ఎకనామిక్స్/ ఇంగ్లీష్/ హిస్టరీ/పొలిటికల్ సైన్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ రూరల్ డెవలప్‌మెంట్/ సోషియాలజీ/ తెలుగు/ హిందీ.
  • ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్టుమెంటేషన్/జాగ్రఫీ/మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ మైక్రోబయాలజీ / ఫిజిక్స్/ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ సెరికల్చర్/ స్టాటస్టిక్స్/ జువాలజీ.
  • ఎంకామ్ జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్
  • మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ)
  • మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్(ఎంఎల్‌ఐఎస్సీ)
  • మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్‌డబ్ల్యూ)
  • పీజీ డిప్లొమా ఇన్ యోగా(ఏడాది కాలపరిమితి)


అర్హతలు..
అభ్యర్థి సంబంధిత డిగ్రీ కోర్సు గ్రూప్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎంఈడీలో ప్రవేశం పొందేందుకు బీఈడీలో 50 శాతం/డిగ్రీ/పీజీలో 45 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ఇప్పటికే డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది డిగ్రీ చివరి సంవత్సరం వార్షిక పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు.

ప్రవేశ పరీక్ష విధానం..
ప్రవేశ పరీక్షలో ఆయా కోర్సులకు సంబంధించిన పేపర్ ప్రశ్నలు మల్టీపుల్ ఛాయిస్‌లో 100 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కులు లేవు. ఇంగ్లీష్/తెలుగు/హిందీ పరీక్షలు ఆయా భాషల్లో మాత్రమే ఉంటాయి. ఇతర సబ్జెక్టుల ప్రశ్న పత్రాలు మాత్రం ఇంగ్లీష్/ తెలుగు భాషల్లో ఉంటాయి. పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్/పేజర్/సెల్‌ఫోన్‌తో పాటు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఎంట్రెన్స్‌లో సాధించిన ర్యాంక్‌తో పాటు అభ్యర్థి రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

  • మొత్తం అన్ని కోర్సుల సీట్లలో 85 శాతం (ఎస్‌ఏయూ పరిధిలోని కళాశాలలు) స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 15శాతం లోకల్ లేదా నాన్‌లోకల్ అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. విద్యార్థినులకు అన్ని కేటగిరిల్లోను 33.33 శాతం సీట్లు కేటాయించారు.


ముఖ్య సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10 ఏప్రిల్ 2020
ఆలస్య రుసుం రూ.500తో: ఏప్రిల్ 20 వరకు, రూ.1000తో ఏప్రిల్ 30 వరకు
తత్కాల్ ఫీజు రూ.5000తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డులు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.skudoa.in  

Photo Stories