Skip to main content

ఏపీ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు..దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 10

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 2021–22 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు అర్హత ఇంటర్మీడియట్‌ బైపీసీ. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. ఆయా కోర్సులు, అర్హతల వివరాలు...

కాలేజీలు – జిల్లాలు..
ఏపీలో మొత్తం ఎనిమిది ప్రభుత్వ, 11 ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో వివిధ పారామెడికల్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్‌) దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చే జిల్లాలను పరిశీలిస్తే..
  • ఆంధ్ర మెడికల్‌ కాలేజీ, విశాఖపట్నం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
  • రంగరాయ మెడికల్‌ కాలేజీ, కాకినాడ: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి
  • సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, విజయవాడ: కృష్ణా జిల్లా
  • గుంటూరు మెడికల్‌ కాలేజీ: గుంటూరు, ప్రకాశం
  • ఎస్వీ మెడికల్‌ కాలేజీ, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు
  • రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, వైఎస్‌ఆర్‌ కడప: కడప జిల్లా
  • కర్నూలు మెడికల్‌ కాలేజీ: కర్నూలు
  • ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, అనంతపురం: అనంతపురం జిల్లా
  • ఈ ఎనిమిది కాలేజీల్లో వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో మొత్తం 861 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చే జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
  • అలాగే వివిధ జిల్లాల్లో మొత్తం 11 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండగా.. వాటిలో 1982 పారా మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అందిస్తున్న కోర్సులు..
  • డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(డీఎంఎల్‌టీ)
  • డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ(డీఎంఐటీ)'
  • డిప్లొమా ఇన్‌ ఆఫ్తల్మాలిక్‌ అసిస్టెంట్‌(డీఓఏ)
  • డిప్లొమా ఇన్‌ డయాలసిస్‌ టెక్నాలజీ(డీడీఐఏఎల్‌వై)
  • డిప్లొమా ఇన్‌ రెస్పిరేటరీ థెరఫీ(డీఆర్‌ఈఎస్‌టీ)
  • డిప్లొమా ఇన్‌ మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ(డీఎంఎస్‌టీ)
  • డిప్లొమా ఇన్‌ పెర్‌ఫ్యూజిన్‌ టెక్నాలజీ(డీ³ఈఆర్‌ఎఫ్‌యూ)
  • డిప్లొమా ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌ కోర్సు(డీఆర్‌జీఏ)
  • డిప్లొమా ఇన్‌ డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ కోర్సు(డీడీఆర్‌ఏ)
  • డిప్లొమా ఇన్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌ కోర్సు(డీకార్డియో)
  • డిప్లొమా ఇన్‌ కాత్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(డీసీఎల్‌టీ)
  • డిప్లొమా ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌ కోర్సు(డీఈసీజీ)
  • డిప్లొమా ఇన్‌ అనస్తీషీయా టెక్నీషియన్‌ కోర్సు(డీఏఎన్‌ఎస్‌)
  • డిప్లొమా ఇన్‌ ఆడియోమెట్రీ టెక్నీషియన్‌ కోర్సు(డీఏఎమ్‌)
  • డిప్లొమా ఇన్‌ మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(డీఎంపీహెచ్‌ఏ)
  • డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ ఫుడ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నీషియన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎస్‌ఎం)
  • డిప్లొమా ఇన్‌ రేడియో థెరఫీ టెక్నీషియన్‌ (డీఆర్‌టీటీ).

అర్హతలు..
రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. బైపీసీ విద్యార్థులు లేకుంటే.. ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు గ్రూపు విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూపు విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. వయసు 16 ఏళ్లు నిండి ఉండాలి. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది:10.04.2021

వివరాలు, దరఖాస్తు ఫారాలకు వెబ్‌సైట్‌: http://117.192.46.176:8080/appmb/index.html

Photo Stories