Skip to main content

ఎన్‌టీఏ ఏఆర్‌పీఐటీ 2021 బోధనలో రిఫ్రెషర్ ప్రోగ్రామ్

మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారికంగా ఆన్‌లైన్ వార్షిక రిఫ్రెషర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని ఆన్‌లైన్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ద్వారా.. ‘యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్’ (ARPIT) పేరుతో ఉన్నత విద్యా బోధనలో ఉన్న ఫ్యాకల్టీ కోసం అందిస్తున్నారు.
దీనిద్వారా టీచింగ్ వృత్తిలో మెళకువలను మెరుగుపరచుకోవడంతోపాటు స్టడీ వెబ్, యాక్టివ్ లెర్నింగ్ బై యంగ్ అండ్ యాస్పై రింగ్ మైండ్స్‌(స్వయం) ద్వారా సర్టిఫికెట్ పొందొచ్చు.

వివరాలు:
టీచింగ్ ఫ్యాకల్టీకి అవకాశం
స్వయం ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా అందిస్తున్న ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్.. దేశంలోని దాదాపు 15లక్ష మంది ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీలకు ఉపయోగపడుతుందని ఎన్‌టీఏ పేర్కొంది. ఇందులో వివిధ అంశాలకు చెందిన విభాగాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ తమకు సంబంధించిన కోర్సు పరీక్ష రాయవచ్చు. శిక్షణ, ఎగ్జామ్, సర్టిఫికేషన్‌ను ఆన్‌లైన్ పోర్టల్ స్వయం ద్వారానే అందిస్తారు. ఈ కోర్సు కెరీర్ అడ్వాన్‌‌సమెంట్ స్కీమ్‌కు రిఫ్రెషర్‌గా యూజీసీ గుర్తించింది.

ఏఆర్‌పీఐటీ ఎగ్జామ్:
యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్ (ఏఆర్‌పీఐటీ) ఎగ్జామ్.. 10 ఏప్రిల్ 2021న ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ఎంచుకున్న కోర్సుల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సాధించిన మార్కులను బట్టి గ్రేడ్స్‌తో సర్టిఫికెట్ జారీ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 3, 2021.
ఫీజు చెల్లించేందుకు చివరి తేది: మార్చి 4, 2021.
దరఖాస్తులో సవరణలు: మార్చి 5వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు
పరీక్ష తేది: ఏప్రిల్ 10, 2021.
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nta.ac.in/  arpit.nta.nic.in

Photo Stories