ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2021 నోటిఫికేషన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షే.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ.
ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఐహెచ్‌ఎంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లోని హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి. హోటల్ పరిశ్రమలో పనిచేయాలనుకునే విద్యార్థుల కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈ) 2021- 22 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఇన్‌స్టిట్యూట్స్-సీట్లు: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 21 ఇన్‌స్టిట్యూట్స్, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్‌స్టిట్యూట్స్ 26, పీఎస్‌యూ యాజమాన్యంలో నడుస్తున్న ఒక సంస్థ, 26 ప్రైవేట్ సంస్థలు.. మొత్తం 74 హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థలు కోర్సులను అందిస్తు న్నాయి. కాగా, తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు ప్రభుత్వ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలు ఉన్నాయి. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియెట్/10+2 కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 జూలై 1 నాటికి జనరల్, ఓబీసీ విద్యార్థులు 25ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 28ఏళ్ల వయసు ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రన్స్‌ను మొత్తం ఐదు విభాగాల్లో 200 ప్రశ్నలతోఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుంది.
బీఎస్సీ-హెచ్‌హెచ్‌ఏలో ప్రవేశం: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో అభ్యర్థులు సాధించిన ర్యాంక్ ఆధారంగా.. ఆయా విద్యా సంస్థల్లో మూడేళ్ల ‘బీఎస్సీ-హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్’ (బీఎస్సీ-హెచ్‌హెచ్‌ఏ) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: మే 10, 2021.
పరీక్ష తేది: జూన్ 12, 2021.
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://nchmjee.nta.nic.in