Skip to main content

ఎన్‌ఐపీహెచ్‌ఎంలో డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రవేశాలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హె ల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీపీహెచ్‌ఎం):
కోర్సు వ్యవ«ధి:
ఏడాది (రెండు సెమిస్టర్లు);
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)/లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

డిప్లొమా ఇన్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌(డీపీహెచ్‌ఎం):
అర్హత: అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/లైఫ్‌ సైన్సెస్‌ల్లో గ్రాడ్యుయేషన్‌/బీఎస్సీ(అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌)/బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://niphm.gov.in

Photo Stories