Skip to main content

ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

సికింద్రాబాద్‌లోని మనోవికాస్‌నగర్‌లో భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబెలిటీస్‌(దివ్యాంగ్‌జన్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
ఎన్‌ఐఈపీఐడీ,హెడ్‌క్వార్టర్స్‌(సికింద్రాబాద్‌)లో కోర్సులు: ఎంఫిల్‌ రిహెబిలిటేషన్‌ సైకాలజీ(రెండేళ్లు); ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు); బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు); పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌(పీజీడీఐఈ) (ఏడాది).
ఎన్‌ఐఈపీఐడీ రీజినల్‌ సెంటర్, కోల్‌కతాలో కోర్సులు: బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు); ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు).
ఎన్‌ఐఈపీఐడీ రీజినల్‌ సెంటర్, నవీ ముంబైలో కోర్సులు: బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు); ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు).
ఎన్‌ఐఈపీఐడీ రీజినల్‌ సెంటర్, నోయిడాలో కోర్సులు: బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీ)(రెండేళ్లు).

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

దరఖాస్తులను సంబంధిత ఎన్‌ఐఈపీఐడీ రీజినల్‌ కార్యాలయాలకు పంపించాలి.
ప్రవేశ పరీక్ష తేది: 17.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://niepid.nic.in

Photo Stories