Skip to main content

ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ .. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే విద్యార్థుల కోసం ఐఐటీ ఢిల్లీ.. ఎంటెక్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.
ది ఇంటర్‌ డిసిప్లినరీ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ (జేసీఎస్‌)గా దీన్ని పేర్కొంటున్నారు. సైబర్‌ సెక్యూరిటీలో ఆధునాతన మెళకువలు నేర్చుకోవడం, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారు చేరొచ్చు.

సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సిస్టమ్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అస్యూరేన్స్‌(సీఓఈ–సీఎస్‌ఐఏ), ది స్కూల్‌ ఆఫ్‌ ఐటీ ఆఫ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ.. ఈ కొత్త ప్రోగ్రామ్‌ ఎంటెక్‌ సైబర్‌ సెక్యూరిటీను అందిస్తున్నాయి. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం ప్రవేశ ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 24 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

కోర్సు స్వరూపం..
ఈ కోర్సులో భాగంగా లాంగ్వేజ్‌ బేస్డ్‌ సెక్యూరిటీ, ఫార్మల్‌ నేషన్స్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ బేస్డ్‌ సిస్టమ్స్, ఫార్మల్‌ వెరిఫి కేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ, సెక్యూర్‌ ఆర్కిటెక్చర్స్, నెట్‌ వర్క్‌ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్‌ డేటా ప్రొటెక్షన్, ఎంబెడెడ్‌ సిస్ట మ్స్‌ తదితర విభాగాల్లో శిక్షణను అందిస్తారు. సైబర్‌ సెక్యూ రిటీలో రీసెర్చ్‌ కెరీర్‌ ప్రారంభించాలనుకునే విద్యార్థులు.. ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

మూడు విభాగాలుగా..
ఈ కోర్సు మొత్తం మూడు విభాగాలుగా ఉంటుంది. అవి..
సిస్టమ్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ u క్రిప్టోగ్రఫి అండ్‌ క్రిప్టో అనాలిసిస్‌ u ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ సెక్యూరిటీ.

అసోసియేటెడ్‌ డిపార్ట్‌మెంట్స్‌..
  • స్కూల్‌ ఆఫ్‌ ఐటీ
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌
  • సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్‌ సిస్టమ్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌.

అర్హతలు..
  • ఎంటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
  • గేట్‌లో అర్హతతోపాటు కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో మంచి ప్రతిభను కనబర్చిన వారై ఉండాలి.
  • ఎంటెక్‌ ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌లో చేరే విద్యార్థులు కోర్సు పూర్తయ్యేవరకు క్యాంపస్‌లోనే ఉండాలి.
  • పార్ట్‌టైమ్‌ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు.. కంప్యూటర్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సంస్థల్లో పనిచేస్తూ ఉండాలి. వీటితోపాటు సంబంధిత సంస్థ లేదా ఇండస్ట్రీ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి.

ముఖ్యమైన సమాచారం..
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రారంభతేదీ : 15.04.2021
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24.04.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:  https://csia.iitd.ac.in

Photo Stories