Skip to main content

అగ్రిసెట్‌–2021 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రిసెట్‌–2021కు దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశం కల్పించే కోర్సు: నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌.
అర్హత: డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ/ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 17–22ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కన్వీనర్‌–అగ్రిసెట్‌–2021 ఓ/ఓ ది అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్, ఆర్‌ఏఆర్‌ఎస్, లామ్‌–522034, గుంటూరు జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 13.08.2021

అగ్రిసెట్‌ 2021 పరీక్ష తేది: 13.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.angrau.ac.in/

Photo Stories