Skip to main content

సంస్కృతంలో వంద పుస్తకాలు రచించా..‘పద్మశ్రీ’ విజయసారథి

ఆధునిక సంస్కృత మహాకవుల్లో ఒకరైన శ్రీభాష్యం విజయసారథికి సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.
ఆయన సంస్కృతంలో సుమారు వంద పుస్తకాలు రచించారు. కరీంనగర్ జిల్లా చేగుర్తిలో మార్చి 10, 1937లో జన్మించిన విజయసారథి.. తొలుత ఉర్దూ మీడియంలో విద్యనభ్యసించినా తర్వాత సంస్కృతంలో పండితుడిగా ఎదిగారు. వరంగల్‌లోని విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చదువుకున్న ఆయన అదే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించి అనేక పుస్తకాలను సంస్కృతంలో రాశారు. మందాకిని, ప్రవీణ భారతం, భారత భారతి వంటి సాహితీ గ్రంథాలను వెలువరించారు.

అలాగే సంస్కృత భాషలో గేయ చందస్సును సృష్టిస్తూ మందాకిని కావ్యంరాశారు. మహామహోపాధ్యాయ, వాచస్పతి పురస్కార్, ఇందిరా బిహారే గోల్డ్‌మెడల్, యుగకర్త వంటి అవార్డులను ఇదివరకే అందుకున్నారు. ‘భారత భారతి’అన్న శీర్షికతో రాసిన గ్రంథం ఆధునిక సామాజిక అంశాలకు పరిష్కారాలు చూపింది.
Published date : 31 Jan 2020 06:42PM

Photo Stories