Skip to main content

పరిశోధనలు చేసి సొంతంగా ఆవిష్కరణలు చేస్తా: ఎంసెట్ 4వ ర్యాంకర్ కౌశల్‌రెడ్డి

తెలంగాణ ఇంజీనీరింగ్ ఎంసెట్ ఫ‌లితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అక్టోబ‌ర్ 6న‌ విడుద‌ల చేశారు.
ఈ ఫ‌లితాల్లో టాప్‌-10 ర్యాంకుల‌ను బాలురే కైవ‌సం చేసుకున్నారు. అందులో 5 ర్యాంకులు తెలంగాణకు చెందిన విద్యార్థులు, మ‌రో ఏపీకి చెందిన విద్యార్థులు సాధించారు. ఈ త‌రుణంలో తెలంగాణ ఎంసెట్ 4వ ర్యాంకర్ కౌశల్‌రెడ్డి త‌న సంతోషాన్ని పంచుకున్నారిలా..
ప్రణాళికాబద్ధంగా, ఇష్టంగా చదువుతూ సబ్జెక్టులపై పట్టు సాధించి ఎంసెట్‌లో 4వ ర్యాంకు సాధించగలిగాను. ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ చేసి సొంతంగా ఆవిష్కరణలు చేయాలనేది లక్ష్యం. రోజూ 8-9 గంటలు చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 327 ర్యాంకు సాధించాను.
Published date : 07 Oct 2020 06:42PM

Photo Stories