Skip to main content

నలుగురికీ ఉపయోగపడేలాఏదైనా చేయాలనుకున్నా..పద్మశ్రీ ట్రినిటీ సయూవూ

ఈశాన్య రాష్ట్రాలలోని మేఘాలయలో ములీ అనే చిన్న గ్రామంలో జన్మించిన ట్రినిటీ సయూవూ ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను చక్కదిద్దేవారు. అంతటితో తృప్తి చెందకుండా, నలుగురికీ ఉపయోగపడే పని కూడా మరేదైనా చేయాలనుకున్నారు.
వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. పసుపు సాగును ఒక ఉద్యమంగా ప్రారంభించారు. లకడాంగ్ అనే పసుపు రకాన్ని పండించటం వల్ల మూడు రెట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలుసుకున్నారు. ట్రినిటీ సయూవూ ఈ విషయాన్ని మేఘాలయాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మందికి తెలియబరిచారు. ప్రతిరోజూ స్కూల్ అయిపోగానే, సాయంకాలం వేళ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే మహిళలను కలుసుకుని, ఈ బంగారు సుగంధ ద్రవ్యం (పసుపు) పంట పండించటం వల్ల వచ్చే అదనపు రాబడి గురించి వారికి ఆసక్తి కలిగేలా వివరించేవారు.

అలాగే అధిక ఆదాయం వచ్చేలా, పసుపు కొమ్ములను స్వయంగా మిల్లులో పట్టించి, పసుపును కవర్లలో ప్యాకింగ్ చేసి, అమ్ముతున్నారు. సేంద్రియ పద్ధతిలో ఈ సాగు జరుగుతోంది. రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను తెలియచేస్తూ, తాము తయారు చేసిన పసుపును దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేసి, సంపన్నులవుతున్నారు ఆమె నుంచి స్ఫూర్తిని పొందినవారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించిన ట్రినిటీ సయూవూను పద్మశ్రీ పురస్కారం వరించి వచ్చింది.
Published date : 31 Jan 2020 06:37PM

Photo Stories