క్యాన్సర్‌తో గెలిచిన ధైర్యమే... 'జెట్‌సెట్‌గో'
Sakshi Education
ఏ విమానంలోనైనా చూడండి! ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. గ్రౌండ్‌స్టాఫ్‌లోనూ ఆడవాళ్లే.
కానీ ఆ విమాన సంస్థల అధిపతులో? అంతా మగవారే. అదీ పరిస్థితి. అలాంటి రంగంలో స్థిరపడాలనుకుంది కనిక టేక్రీవాల్. 18 ఏళ్లకు ఎయిర్‌వేస్‌లో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాక ఎంబీఏ కోసం యూకే వెళ్లింది. కానీ ఎంబీఏ పూర్తవుతూనే 2011లో ఆమెకు క్యాన్సర్‌అని తేలింది. ఓ డాక్టర్‌ను కలిసింది. 'నీకింకా కొన్నిరోజులే మిగిలున్నాయి' అన్నాడాయన. కానీ ఆమె ముందు ఆ క్యాన్సరే ఓడిపోయింది. ''అది వరమో, శాపమో అని చెప్పను. నా జీవితంలో అదో క్లిష్టమైన దశ. చాలా ధైర్యాన్ని, ఖాళీ సమయాన్ని ఇచ్చిన దశ'' అంటారు కనిక. అప్పట్లో దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిగా భవిష్యత్‌ప్రణాళిక కోసం కేటాయించింది. అక్కడే.. ఛార్టర్డ్‌విమానాలను, హెలికాప్టర్లను అద్దెకిచ్చే 'జెట్‌సెట్‌గో' రూపుదిద్దుకుంది. సొంత విమానాలు, హెలికాప్టర్లు ఉన్న వారితో ఓ నెట్‌వర్క్‌ను రూపొందించి... అద్దెకు కావాలనుకున్న వారితో సంధానించటమే ఈ సంస్థ పని. అంటే.. 'గగనతల ఓలా' అన్నమాట. తల్లిదండ్రులు ఈ ఆలోచనకు ససేమిరా అన్నారు. విమానయాన రంగంలో మహిళలు రాణించలేరన్నారు. కానీ క్యాన్సర్‌ను గెలిచిన ఈ మొండిఘటం వినలేదు. పునీత్‌దాల్మియా, యువరాజ్‌సింగ్‌వంటి వారిని కలిసింది. 2014లో ఆరంభించిన కొన్నాళ్లకే వారు పెట్టుబడులు పెట్టడంతో జెట్‌సెట్‌గో నిలదొక్కుకుంది. రెండేళ్లు తిరక్కుండానే లాభాల్లోకీ వచ్చింది.
Published date : 07 Nov 2020 01:26PM