హైదరాబాద్ అమ్మాయి అలీజా నూర్‌ఖాన్ కి టోఫెల్ స్కాలర్‌షిప్
Sakshi Education
అలీజా నూర్‌ఖాన్.. ప్రతిష్టాత్మక టోఫెల్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన హైదరాబాద్ అమ్మాయి. గత నెలలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విజేతలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. భారతదేశం నుంచి ఈ స్కాలర్‌షిప్‌నకు ఈ ఏడాది 21 మంది ఎంపికైతే.. వారిలో మన రాష్ట్రం నుంచి ఆ అదృష్టాన్ని దక్కించుకుంది మాత్రం అలీజా నూర్‌ఖాన్ ఒక్కరే. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోకుండా.. విజేతగా నిలవటం విశేషం. నూర్‌ఖాన్ సక్సెస్ స్పీక్స్ తన మాటల్లోనే...
ప్రొఫైల్
పేరు: అలీజా నూర్‌ఖాన్
పదోతరగతి: సీబీఎస్‌ఈ ఏ1 గ్రేడ్(10 పాయింట్స్)
చదువు: ఐబీ డిప్లొమా
చేరే కోర్సు: ఎకనామిక్స్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ (యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, అమెరికా)
టోఫెల్ మార్కులు: 119/120
అమ్మకే ఎక్కువ సంతోషం:
మొదటి ప్రయత్నంలోనే టోఫెల్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికవటం చాలా సంతోషాన్నిచ్చింది. నా కంటే అమ్మ ఎక్కువ ఆనందంగా ఉంది. నా మెయిల్ చెక్‌చేసి టోఫెల్‌కు ఎంపికయినట్లు తానే చెప్పింది. స్కాలర్‌షిప్ కింద మూడు వేల అమెరికన్ డాలర్లు లభిస్తాయి. ఈ మొత్తాన్ని నేను చేరే యూనివర్సిటీకి అందజేస్తారు. ఎంపిక ప్రక్రియలో మొత్తం 120 మార్కులకుగాను 119 మార్కులు వచ్చాయి. స్పీకింగ్ పార్టులో చిన్న తడబాటుతో ఒక మార్కు తగ్గింది. లేకుంటే పూర్తి మార్కులు వచ్చేవి.
తాతయ్య స్ఫూర్తి:
నాన్న ఆర్మీలో పని చేయటం వల్ల ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉన్నాం. దాంతో తొమ్మిదో తరగతి వరకూ ఢిల్లీలోనే చదివా. నాన్న రిటైర్డ్ అయ్యాక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ రావటంతో హైదరాబాద్‌కు వచ్చాం. పదో తరగతి ఇక్కడి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివా. ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్ డిప్లొమా కోర్సును పూర్తి చేశాను. సబ్జెక్టులు.. ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, హిందీ. మా తాతయ్య ఎ.ఆర్. షేర్వాణీ నాకు ఆదర్శం, స్ఫూర్తి. 80 ఏళ్ల వయసులోనూ.. ఆయన తన పనిలో నిబద్ధత, క్రమశిక్షణ, తపన అద్భుతం. సమాజంలో అక్షరాస్యతపెంచేందుకు కృషి చేసేవారు. టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పనిచేశారు. చదువుకు దూరంగా ఉన్న పిల్లల కోసం వారి దగ్గరకెళ్లి చదువు విలువ తెలియజెప్పేవారు. పేద పిల్లలకు ఆర్థికంగా సాయం చేయటమేకాదు.. టీచింగ్‌లో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందించేవారు.
ఇదీ పరీక్ష తీరు:
టోఫెల్ స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరుకావొచ్చు. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విభాగాలు ఉంటాయి. నేను అండర్ గ్రాడ్యుయేట్‌లో పరీక్ష రాశా. దరఖాస్తు చేయటం దగ్గర నుంచి పరీక్ష రాసే వరకూ.. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. స్పీకింగ్, లిజనింగ్, ైరె టింగ్, రీడింగ్‌లలో ఒక్కో విభాగానికి 30 మార్కులు ఉంటాయి. లాజికల్, హ్యూ మర్, పొయెట్రీ, లిటరేచర్.. ఇలా దేన్నుంచైనా ప్రశ్నలు అడగొచ్చు. ఆన్‌లైన్ ద్వారా నాలుగు విభాగాల్లో స్కిల్స్‌ను ప్రజెంట్ చేస్తూ పరీక్ష కొనసాగుతుంది. భిన్నమైన స్ట్రక్చర్‌తో ఉండే ఈ పరీక్ష నాలుగు గంటలపాటు ఉంటుంది. ఇంగ్లిష్ భాషలో అంతవరకూ వినిపించని కొత్త పదాలు, చాలా క్లిష్టమైనవి అడుగుతారు. ఒక పదానికి అర్థం తెలిసినట్లే ఉంటుంది. కానీ, సరైన భావం మరొకటి ఉం టుంది. టోఫెల్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదు.
ఇలా సాధించాను:
స్కూల్ స్థాయి నుంచి అన్నిట్లోనూ ఫస్ట్‌లో ఉండేదాన్ని. ఏ పని చేసినా ఉన్నతంగా ఉండాలంటూ.. తరచూ అమ్మ చెప్పేది. క్లాసులో ఎప్పుడైనా వెనుకబడినా నాన్న ధైర్యా న్నిచ్చే వారు. అదే ప్రోత్సాహంతో టోఫెల్‌కు హాజరయ్యా. ఓర్పు, లాంగ్వేజ్ స్కిల్స్‌తోనే విజయం సాధించగలిగాను. స్పీకింగ్ పార్ట్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి అడిగినపుడు సమాధానం చెప్పటంలో కొద్దిగా తడబడ్డా. దాంతో గొంతులో కొద్దిగా శబ్దం వచ్చింది. దాంతో ఒక మార్కు తగ్గింది.
బలంగా బేసిక్స్:
ఇంగ్లిష్ బేసిక్స్‌లో బలంగా ఉంటే టోఫెల్‌లో మంచి స్కోరు చేయవచ్చు. స్కూల్‌లో చదివేటప్పుడే భాషలో తప్పులను తల్లిదండ్రులు, టీచర్స్ సరిదిద్దితే పెద్దగా కష్టపడే బాధ తప్పినట్లే. ఇంగ్లిష్ మీడియంలో చదివినా.. గ్రామర్‌లో చాలా తప్పులు చేస్తుంటాం. వాటిని పరిశీలించుకొని సరిదిద్దుకోవాలి. ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకునేందుకు ఆంగ్ల సాహిత్యం చదవాలి. వొకాబులరీ, గ్రామర్ తప్పులు లేని సంభాషణ చాలా ముఖ్యం. వీటన్నింటినీ మించి ఏకబిగిన నాలుగు గంటలు కంప్యూటర్ ముందు కూర్చోగల ఓర్పును అలవరచుకోవాలి.
ఫిల్మ్ మేకింగ్ నా కల:
ఎకనామిక్స్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఫిల్మ్‌మేకింగ్ నా కల. ఈ రెండు సబ్జెక్టులతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేషన్‌కు దరఖాస్తు చేశా. యాక్టింగ్, డెరైక్షన్, కెమెరా.. ఇలా సృజనాత్మకతను చాటేందుకు ఈ విభాగంలో ఎంతో అవకాశం ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్‌తో కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరాలన్నది సంకల్పం. సినిమాలు సమాజానికి మార్గదర్శనం చేస్తాయనేది నా అభిప్రాయం. స్కూల్ చదివేటపుడు ‘ఫ్రేమ్స్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను.

Published date : 22 Aug 2013 04:35PM