గూగుల్ ఫెలోషిప్ సాధించిన రజ్వీ షా
Sakshi Education
‘గూగుల్’.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ.. ఇంటర్నెట్ వినియోగించే ప్రతి ఒక్కరికి మొదట గుర్తొచ్చే సెర్చ్ ఇంజిన్. ఈ సంస్థ కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు దేశాల వారీగా ఫెలోషిప్‌లను అందిస్తోంది. మన దేశంలోనూ ‘గూగుల్ ఇండియా పీహెచ్‌డీ ఫెలోషిప్’ పేరుతో ఈ ప్రోగ్రాంను అమలు చేస్తూ.. ఏటా అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఐదుగురిని ఎంపిక చేయగా.. అందులో ఒకరిగా నిలిచిన ట్రిపుల్ ఐటీ- హైదరాబాద్ విద్యార్థిని రజ్వీ షాసక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే..
‘గూగుల్’ గుర్తింపు.. అదృష్టం:
గూగుల్ ఇండియా పీహెచ్‌డీ ఫెలోషిప్‌నకు ఎంపికవ్వడం ద్వారా ‘గూగుల్’ గుర్తింపు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ విషయంలో నా గైడ్ ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ పి.జె.నారాయణన్ ప్రోత్సాహం మరువలేనిది. పరిశోధన అనే సుదీర్ఘ ప్రయాణంలో ఈ ఫెలోషిప్ ఎంతో తోడ్పడుతుంది.
ముందు నుంచే:
వాస్తవానికి గూగుల్ పీహెచ్‌డీ ఫెలోషిప్ గురించి నాకు ముందు నుంచే అవగాహన ఉంది. ఈ ప్రకటనను https:// research.google.com/university/లో పొందుపరుస్తారు. అదే విధంగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సిబ్బంది కూడా ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ సమాచారాన్ని తెలియజేస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇలా..:
గూగుల్ ఇండియా పీహెచ్‌డీ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకునేందుకు పీహెచ్‌డీ ( కోర్సులో ఒకటి నుంచి మూడు సంవత్సరాలను అభ్యసిస్తూన్న) అభ్యర్థులు అర్హులు. మొత్తం నాలుగేళ్ల వ్యవధి వరకు అందించే ఈ ఫెలోఫిప్‌నకు దరఖాస్తు చేసుకునే పీహెచ్‌డీ విద్యార్థులు.. రీసెర్చ్ స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, మూడు రికమండేషన్ లెటర్స్, బ్యాచిలర్ డిగ్రీ నుంచి ప్రస్తుతం వరకు గ్రేడ్ షీట్స్ జతపర్చాలి. రికమండేషన్ లెటర్స్‌లో ఒకటి కచ్చితంగా ప్రస్తుత అడ్వైజర్ లేదా భవిష్యత్తులో అడ్వైజర్‌గా వ్యవహరించనున్న ప్రొఫెసర్ ఇవ్వాలి. రీసెర్చ్ స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ విషయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా పరిశోధనపై ఆసక్తి, ఏ అంశంపై పరిశోధన చేయాలనుకుంటున్నాం? అనే విషయాలు స్పష్టంగా తెలియజేయాలి.
పలు రకాల ప్రోత్సాహకాలు:
ఈ ఫెలోషిప్ కింద పలు రకాల ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెల రూ.35 వేల స్టైపెండ్, అందుతుంది. కాంటింజెన్సీ ఫండ్ కింద నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ.65 వేలు లభిస్తాయి. అదే విధంగా రీసెర్చ్ సంబంధిత సెమినార్లు, కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యేందుకు అయ్యే ప్రయాణ భత్యం కోసం ట్రావెల్ గ్రాంట్ పేరిట రూ.3 లక్షలు అందజేస్తారు. వీటితోపాటు పరిశోధనపరంగా అవసరమయ్యే పుస్తకాలు, స్టేషనరీ తదితర పరికరాల కొనుగోలుకు కూడా చేయూతనందిస్తారు.
పరిశోధన.. ఆసక్తి గల అంశాలు:
పరిశోధన పరంగా నేను ఆసక్తి చూపే అంశాలు విజువల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇమేజ్ వీడియో ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ అండ్ మెషీన్ లెర్నింగ్. అయితే వీటన్నింటిలో మిగతావాటితో పోల్చితే ఎక్కువ ఆసక్తి ఉన్న అంశం.. కంప్యూటర్ విజన్ అప్లికేషన్స్. కంప్యూటర్ విజన్ ఒక విస్తృతమైన, ఆకర్షణీయమైన అంశం. దీని ప్రాథమిక భావన-మనుషులు చేసే విధంగానే ఆయా పనులను కంప్యూటర్స్ కూడా నిర్వహించేలా రూపొందించడం. కానీ ఇప్పటికీ మనం ఈ లక్ష్యానికి ఎంతో దూరంలో ఉన్నాం. అయితే, ఇటీవల ఈ రంగంలో పురోగతి కనిపిస్తోంది. అదే విధంగా విజువల్ డేటా(ఇమేజెస్, వీడియో)లో కూడా గత దశాబ్దంగా ఎంతో పురోగతిని సాధించాం. ప్రస్తుతం నేను ఒక శిఖరాన్ని విభిన్న భంగిమలలో చిత్రీకరించి, వాటిని 3ఈ పాయింట్ క్లౌడ్‌లో రూపొందించడం అనే అంశంపై పరిశోధన చేస్తున్నా.
సీఎస్‌ఈ తాజా పురోగతి:
గత దశాబ్దంలో కంప్యూటర్ సైన్‌స ప్రధానంగా మూడు విభాగాల్లో గణనీయ పురోగతి నమోదు చేసుకుంది.
అవి...
పస్తుతం మన దేశంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ దిశగా ప్రభుత్వం, ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర సంస్థలు విద్యార్థులను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నో రకాల ప్రోత్సాహకాలు, ఫెలోషిప్‌లను కూడా అందిస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి చూపడం లేదు.
అకడమిక్ ప్రొఫైల్:

- అడ్వాన్సెస్ ఇన్ మెషీన్ లెర్నింగ్/ప్యాట్రన్ రికగ్నిషన్(వెబ్ అన్వేషణ, భావం గుర్తింపు, సంభాషణ గుర్తింపు)
- వెబ్ 2.0 (సోషల్ మీడియా సైట్స్, బ్లాగ్స్, కంటెంట్ షేరింగ్ సైట్స్ తదితరాలు).
- మొబైల్ ఇంటర్నెట్ పరికరాలు (ఉదా: స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు తదితరాలు)
పస్తుతం మన దేశంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ దిశగా ప్రభుత్వం, ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర సంస్థలు విద్యార్థులను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నో రకాల ప్రోత్సాహకాలు, ఫెలోషిప్‌లను కూడా అందిస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి చూపడం లేదు.
అకడమిక్ ప్రొఫైల్:
- 2005లో నిర్మా యూనివర్సిటీ (అహ్మదాబాద్)లో బీటెక్(ఈసీఈ).
- 2009లో ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ నుంచి ఎంఎస్ బై రీసెర్చ్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) .
- 2012లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి 2013 జనవరి వరకు జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మాటిక్స్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా విధులు.
- 2013 ఫిబ్రవరిలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశం.
Published date : 12 Sep 2013 05:37PM