‘ఎయిర్‌డెక్కన్ ’ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ సక్సెస్ స్టోరీ
Sakshi Education
పేదవాడిని రూపాయి టికెట్‌తో విమానంలో కూచోబెట్టిన ‘ఎయిర్‌డెక్కన్’ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్...అలాగే భర్త విమానం ఎగరేయడానికి ముందే ‘బన్ వరల్డ్’ అనే బేకరీ పెట్టి అతని కల నెరవేర్చుకోవడానికి గొప్ప బలం ఇచ్చిన భార్య భార్గవి గోపీనాథ్ నిజ జీవిత విశేషాలు..
పెద్దలు ఇచ్చిన పొలంలో...
కెప్టెన్‌గా, ‘ఎరుుర్‌డెక్కన్’ వ్యవస్థాపకుడుగా దేశానికి తెలిసిన వ్యక్తి గోపీనాథ్. గోపీనాథ్ 1980లలో తన 28వ ఏట మిలట్రీ నుంచి బయటపడ్డాడు. ఆయన కర్ణాటకలోని తన సొంత ప్రాంతం హసన్ కు వచ్చి సేంద్రీయ పద్ధతుల్లో తన పెద్దలు ఇచ్చిన పొలంలో సెరికల్చర్ ప్రారంభించాడు. ఆయనకు భార్గవితో పెళ్లరుు్యంది. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 1997లో చార్టర్ హెలికాప్టర్లను అద్దెకు తిప్పే సంస్థను గోపీనాథ్ మొదలెట్టే నాటికే పిల్లల చదువు కోసమే కాదు కుటుంబానికి ఆర్థికపరమైన దన్ను కోసం భార్గవి బెంగళూరు వచ్చేశారు. ఆమె బంధువొకరు అప్పటికే బెంగళూరులో బేకరీ నడుపుతున్నారు.
తన వెనుక తన భార్య నడిపే బేకరి..
ఆయన సహాయంతో మల్లేశ్వరంలో ఆమె ‘బన్ వరల్డ్’ అనే బేకరీని స్థాపించారు. కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడాన బన్ వరల్డ్ విపరీతంగా ఆదరణ పొందింది. విద్యార్థులు అక్కడికి వచ్చి కూచునే స్థలం అరుు్యంది. గోపీనాథ్ తన జీవితంలో ఏ ప్రయోగం చేసినా, సామాన్యుడు ఎక్కే విమానయాన సంస్థ ప్రారంభించాలనుకున్నా తన వెనుక తన భార్య నడిపే బేకరి ఉంది, తనకు ఆమె సంపూర్ణ మద్దతు ఉంది అని భావించడం వల్లే. అలాగని భార్గవి పూర్తిగా భర్త చాటు భార్యగా పూర్తిగా ఉండలేదు. గోపీనాథ్‌కు సలహాదారుగా, మార్గదర్శిగా, ఆర్థిక సర్దుబాటుదారుగా కూడా ఉంది. అందుకే తన జీవిత కథ స్ఫూర్తితో ఇటీవల తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను చూసిన గోపీనాథ్‘నా భార్య పాత్ర ఎలా ఉండాలో అలా ఉంది.
సంచలన నిర్ణయాలతో..
కర్ణాటకకు చెందిన గోపీనాథ్‌ను భారత పౌర విమానయాన చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా చెప్పుకుంటారు. 2003 వరకూ ఆకాశంలో విహరించడం అనేది డబ్బున్నవారి వ్యవహారంగా మాత్రమే దేశంలో ఉంటే గోపీనాథ్ తన ‘ఎరుుర్‌డెక్కన్ ’ సంస్థతో దానిని సమూలంగా మార్చేశాడు. ఒక్కశాతం మంది కే అందుబాటులో ఉండే విమానయానాన్ని దాదాపు 40 శాతం మందికి ఆయన చేరువ చేశాడు. చిన్న విమానాలు నడపడం, చిన్న ఊళ్లకు నడపటం, ట్రావెల్ ఏజెంట్ కమీషన్‌ను తొలగించి నేరుగా టికెట్‌కొనే ఏర్పాటు చేయడం, ప్రయాణంలో ఇచ్చే తినుబండారాల, పానీయాల చార్జిని తొలగించి అవి కావాల్సిన వారు ఫ్లరుుట్‌లోనే కొనుక్కునే ఏర్పాటు చేయడం ఇవన్నీ సంచలనం సృష్టించారుు.
‘ఒక రూపారుు’ కే టికెట్ ఇలా...
అన్నింటి కంటే మించి ‘ఒక రూపారుు’ టికెట్ స్కీమ్‌పెట్టి రెండు మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటే ఒక్క రూపారుుకే విమాన ప్రయాణం చేయొచ్చు అని ఆఫర్ ఇవ్వడంతో రైలులో ఎన్నడూ ఫస్ట్‌క్లాస్ ప్రయాణం చేసి ఎరగని వారు కూడా విమానం ఎక్కారు. 2003-2007 వరకూ సాగిన ఎరుుర్‌డెక్కన్ ఆ తర్వాత ‘కింగ్‌ఫిషర్’లో విలీనం అరుు్యంది. తన అనుభవాలను ఆయన ‘సింప్లి ఫై ్ల’ పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తిగానే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తయారైంది.

Published date : 18 Nov 2020 03:07PM