క్యాట్‌లో ఉత్తమ ప్రతిభ
Sakshi Education
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఏర్పడింది.. అందుకోసం మేనేజ్‌మెంట్ విద్యకు తలమానికంగా నిలుస్తోన్న ‘ కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)’ హాజరయ్యాడు..
వరుసగా మూడు సార్లు నిరాశే మిగిలింది. అయినా నిరంతర కృషితో నాలుగో ప్రయత్నంలో ‘క్యాట్’లో 100 పర్సంటైల్ సాధించాడు అనుముల ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ఈ సారి100 పర్సంటైల్ సాధించిన 16 మందిలో ఒక్కరు ఉత్తమ్.. ఈ ప్రయత్నంలో తనకు ఎదురైన అనుభవాలను భవితతో పంచుకున్నాడు..
మాది నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలోని త్రిపురారం గ్రామం. నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో చీఫ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అమ్మ గృహిణి. తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
నాలుగో ప్రయత్నం:
తొలిసారిగా 2011లో క్యాట్ పరీక్ష రాశాను. 2012,13లో కూడా క్యాట్ రాసాను. 2013లో మార్కులు బాగానే వచ్చినా ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. ఈ సారి క్యాట్ మొదటి విభాగంలో 99.89, రెండో విభాగంలో 99.98, మొత్తం 100 పర్సంటైల్ సాధించాను. గణితంపై పట్టు, వెర్బల్ ఎబిలిటీ మెరుగుపడడం ద్వారానే ఈ సారి మంచి స్కోర్ సాధ్యమైంది. ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐఎం- బెంగళూరు, ఐఐఎం- కోల్‌కతా.. వీటిలో ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ లభించినా చేరాలనుకుంటున్నాను. నాకు ఫైనాన్షియల్ సబ్జెక్ట్ అంటే ఇష్టం. ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన తర్వాత స్పెషలైజేషన్‌ను నిర్ణయించుకుంటా.
మేనేజ్‌మెంట్‌వైపు ఆసక్తి:
ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరు తమ విభాగంతో సంబంధం లేకుండా మైనర్ కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మేనేజ్‌మెంట్ కోర్సును ఎంచుకున్నాను. అప్పుడే మేనేజ్‌మెంట్ కోర్సుల పట్ల ఆసక్తి ఏర్పడింది. దాంతో ఎంబీఏ చేయాలని నిర్ణయించుకున్నా. అది కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నుంచి. ఆ దిశగా క్యాట్‌లో మంచి పర్సంటైల్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను.
క్యాట్ ప్రిపరేషన్:
క్యాట్‌లోని రెండు విభాగాల్లోని మొదటిదైన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ పెద్దగా కష్టమనిపించలేదు. ఎందుకంటే నాకు మొదటి నుంచి గణితంపై మంచి పట్టు ఉంది. కాబట్టి ఈ విభాగం కోసం ఎక్కువగా ప్రిపేర్ కావల్సిన అవసరం రాలేదు. కాకపోతే వేగాన్ని పెంచుకోవడానికి మాత్రం ఎక్కువగా మాక్ టెస్ట్‌లు రాశాను. దానికితోడు ఈ సారి క్యాట్ విధానం మారింది. ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఇది కూడా నాకు ఉపయోగపడింది. రెండో విభాగంలో లాజికల్ రీజనింగ్‌తో పోల్చితే వెర్బల్ ఎబిలిటీ కష్టంగా అనిపించింది. ఈ విభాగంపై పట్టు సాధించడానికి ఇంగ్లిషు దినపత్రికలతోపాటు ఇంగ్లిషు నవలలను ఎక్కువగా చదివాను. ఇది ఈ విభాగంలో మంచి స్కోరుకు ఎంతగానో తోడ్పడింది.
కోచింగ్ తీసుకోకుండానే:
క్యాట్ పరీక్షకు కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. కోచింగ్ ద్వారా పరీక్ష విధానం, ప్రశ్నల సరళి, ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపర్చుకోవచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌లలో ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే కోచింగ్ అవసరం లేకుండానే క్యాట్‌లో విజయం సాధించొచ్చు. నేను కోచింగ్ తీసుకోలేదు. కానీ ఎక్కువ ప్రాక్టీస్ పరీక్షలు రాశాను.
అభ్యర్థులు చేసే పొరపాట్లు:
క్యాట్ అభ్యర్థులు ఎక్కువగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో ప్రిపేరై మిగతా అంశాలను అంతగా పట్టించుకోరు. నేను కూడా మొదటిసారి పరీక్ష రాసినప్పుడు అలాంటి తప్పే చేశాను. అది సరైన విధానం కాదు. అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. పరీక్షలో ప్రశ్నలను వేగంగా సాధించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. కొన్ని ప్రశ్నలకే ఎక్కువ సమయం వెచ్చించడం సరికాదు. సమయపాలన ఎంతో ప్రధానం.
సలహా:
క్యాట్‌లో విజయం సాధించాలంటే అన్ని అంశాల్లో సమగ్ర ప్రిపరేషన్ తప్పనిసరి. వెర్బల్ ఎబిలిటీలో స్కోరింగ్ చేయాలంటే విస్తృతంగా చదవాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా వేగం, కచ్చితత్వం పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఏయే విభాగాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకోవచ్చు. మరో విషయం మారిన విధానంలో వేగంగా, కచ్చితత్వంతో జవాబులను గుర్తించడం కూడా కీలకం.

Published date : 16 Jan 2015 04:58PM