రైతు కుటుంబం నుంచి ర్యాంకర్ వరకు
Sakshi Education
- డాక్టర్‌నవుతా... అదే నా జీవిత లక్ష్యం
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 437మార్కులతో టాపర్‌గా ఎన్.సంధ్య
సంతోషంగా ఉంది.. ఊహించలేదు:
ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో అన్ని సబ్జెక్టులు బాగానే ప్రిపేరయ్యాను. పరీక్షకు రెండునెలల ముందు నుంచీ రివిజన్ మొదలుపెట్టాను. కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ దష్టికేంద్రీకరించాను. దాంతో పరీక్షలో అన్ని సబ్జెక్టులు బాగానే రాశాను. పరీక్షలన్నీ పూర్తయ్యాక మొత్తం 435 మార్కులు వస్తాయని అంచనా వేసుకున్నా. కాని 437 మార్కులతో స్టేట్ ఫస్ట్‌ర్యాంకు వచ్చింది. నిజంగా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఫలితాలతో ఇంట్లో తల్లిదండ్రులు సైతం చాలా సంతోషంగా ఉన్నారు.
నా చదువంతా అక్కడే!
మాది నెల్లూరు జిల్లా, హరినాథపురం. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ గృహిణి. టెన్త్‌వరకు నెల్లూరులో చదివాను. టెన్త్‌లో మొత్తం 563 మార్కులు సాధించాను.
డాక్టర్ కావాలనేదే ఆశ..
ఇంటర్ పూర్తయ్యాక మెడిసిన్ చేయాలనేదే నా కల. ఎంబీబీఎస్ తర్వాత కార్డియాక్ విభాగంలో నైపుణ్యం సాధించాలని ఉంది. నాకు చిన్నప్పటినుంచీ వైద్యరంగం అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా నన్ను అలాగే చూడాలనుకుంటున్నారు. అందుకే ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులు సాధించి టాప్ కాలేజీలో సీటు సాధించాలనేదే నా ధ్యేయం. వైద్యురాలిగా ఆపదలో ఉన్నవారిలో కొంతమందినైనా ఆదుకోవాలనుకుంటున్నాను.
సబ్జెక్టుల వారీ మొత్తం మార్కులివే..
నా హాల్ టిక్కెట్ నెంబరు 1208118428. సబ్జెక్టుల వారీగా నా మార్కులు...
- సంస్కృతం 99
- ఇంగ్లిష్ 98
- బోటనీ 60
- జువాలజీ 60
- ఫిజిక్స్ 60
- కెమిస్ట్రీ 60
మొత్తం అన్ని సబ్జెక్టులకు సమానంగా సమయం కేటాయించి చదివాను. ముందు కష్టమైన సబ్జెక్టులను గుర్తించి వాటిని ఒకటికిరెండుసార్లు ప్రిపేరయ్యాను. ప్రధానంగా ఎక్కువ మార్కులు స్కోరు చేయడానికి ఇంగ్లిష్, సంస్కృతం సబ్జెక్టులు చాలా హెల్ప్ అవుతాయి. అందుకే ఈ రెండింటిపై ఎక్కువగా దష్టిసారించాను. అదేవిధంగా జువాలజీ సబ్జెక్టు కొంత కష్టంగా తోచింది. పైగా ఈ సబ్జెక్టు పరిధి ఎక్కువగా ఉండడంతో సమయం ఎక్కువగా తీసుకునేది. అందుకే చదివిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి, రివిజన్ చేశాను. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు పెరిగింది. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రిపరేషన్ సమయం పెంచి రోజుకు సుమారు 9గంటల వరకు చదివాను. అదేవిధంగా కాలేజ్ ఇచ్చిన మెటీరియల్ చదివాను. కష్టమైన సబ్జెక్టులకు కాలేజీ
లెక్చరర్ల నుంచి సలహాలు తీసుకున్నా. ఇది ఎక్కువ స్కోరింగ్‌కు చాలా ఉపయోగపడింది.
హాబీలివే...
స్టోరీ పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఎప్పుడు సమయం దొరికినా వెంటనే ఈ పుస్తకాలు చదువుతాను. అలాగే టీవీ కూడా చూస్తాను.
ఇదే నా సలహా:
ఇంటర్ ఫస్ట్‌ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌లో ఎక్కువ మార్కులు వస్తేనే ఆ తర్వాత కెరీర్ బాగుంటుంది. అందుకే ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ముందు నుంచే సబ్జెక్టువైజ్‌గా ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తిచేసుకుంటుండాలి. ముందు కష్టమైన సబ్జెక్టులపై దష్టిసారిస్తే పరీక్షల సమయం దగ్గరపడేసరికి ఆ సబ్జెక్టుపై పట్టుపెరిగి మంచి మార్కులు సాధించవచ్చు. ఎంత ఎక్కువ కష్టపడితే అన్ని మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. చాలామంది ఇంగ్లిష్ అంటే భయపడతారు. వాస్తవానికి ఇది హై స్కోరింగ్ సబ్జెక్టు. ఆల్ ద బెస్ట్!!
Published date : 20 Apr 2012 05:11PM