భిన్నమైన కెరీర్‌కు కామర్స్ బెస్ట్
Sakshi Education
సీఏ,సీపీటీ ఆలిండియా ఫస్ట్‌ర్యాంకర్ శరత్ సక్సెస్‌సీక్రేట్
అందరూ ఒకే దారిలో నడిస్తే మార్గం ఇరుకుగా మారుతుంది. అదే మరో కొత్తదారిని కనిపెట్టి వెళితే గమ్యాన్ని తేలిగ్గా చేరవచ్చంటున్నాడు కందుకూరి శరత్. కెరీర్‌లో ఉన్నతంగా ఎదిగేందుకు తాను అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నానంటున్నాడు. నిన్న ప్రకటించిన సీఏ-సీపీటీ(కామన్ ప్రొఫియన్సీ టెస్ట్)లో జాతీయస్థాయిలో శరత్ మొదటి ర్యాంకు సాధించాడు. లక్షలాది మంది పోటీపడిన పరీక్షలో టాపర్‌గా నిలవటం వెనుక విజ యరహస్యం ‘సాక్షి-భవిత’తో పంచుకున్నాడు. అవేంటో విజేత మాటల్లోనే.
మంచి ర్యాంకు వస్తుందనుకున్నా
జాతీయస్థాయిలో మొదటిర్యాంకు రావటం చాలా ఆనందంగా ఉంది. వాస్తవానికి టాప్-5లో ఉంటాననుకున్నా. కానీ ఫస్ట్ రావటం ఆశ్చర్యమనిపించింది. 194/200 మార్కులు వచ్చాయి. అందరికంటే విభిన్నంగా కెరీర్‌ను మలచుకోవాలనే ఉద్దేశంతో సీఏ కోర్సు ఎంచుకున్నా. అదే దీక్షతో మొదట్నుంచి కష్టపడేవాణ్ని. మొదటి ఫలితంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
సైన్స్ అంటే ఇష్టం లేకనే...
పదోతరగతి చదివే ముందునుంచే చాలామందిని గమనించేవాణ్ని. వారిలో మా బంధువులు, స్నేహితులకు సంబంధించిన వాళ్లు ఉన్నారు. చాలామంది ఉన్నత చదువులు పూర్తిచేసి ఖాళీగా ఉండటం బాధనిపించేది. అంతకష్టపడి చదివినా ఉద్యోగం సంపాదించలేకపోవటానికి కారణాలను అప్పట్లోనే తెలుసుకున్నా. దీంతో తెలియకుండానే సైన్సుపై ఆయిష్టత ఏర్పడింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కెరీర్‌లో నిలదొక్కుకునేలా కామర్స్ కోర్సులు బావుంటాయి. కెరీర్‌లో స్ధిరపడేందుకు ఎవరి రికమండేషన్లు అవసరంలేదు. సమాజంలో గౌరవం, ఆర్ధికంగా నిలదొక్కుకునే మార్గం ఉంటుందన్నఅనే ఆలోచనతో ఇటువైపు వచ్చా.
అమ్మానాన్నల ప్రోత్సాహమే కీలకం
మాది మెదక్ జిల్లా సిద్ధిపేట. పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నా. నాన్న కందుకూరి చంద్రం చిన్నవ్యాపారి. అమ్మ భాగ్యలక్ష్మి గృహిణి. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని హస్తినాపురం శ్రీమేధ‘వి’లో చేరా. ఎంఈసీలో 969/1000 మార్కులు తెచ్చుకున్నా. పదోతరగతి పూర్తవగానే పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకుని వారి సామర్థ్యం గుర్తించి కోర్సులు చదివిస్తే బావుంటుంది. మా తల్లిదండ్రులు చేసింది అదే. నాకు సైన్సంటే ఇష్టంలేదని తెలిసే.. మ్యాథ్స్, కామర్స్ ఉన్న ఎంఈసీలో జాయిన్ చేశారు.
ఇష్టపడి చదివితే చాలా ఈజీ
ఇంటర్ చదువుతూనే సీపీటీ పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఇంటర్ అర్హతతోనే సీపీటీ పరీక్ష రాయాలి. మార్చి తర్వాత మూడు నెలలు సీఏ-సీపీటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పరీక్ష రాయాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ ఉండేది. ఛార్టడ్ అకౌంటెంట్(సీఏ) కోర్సు అనగానే చాలా కష్టమనేది వాస్తవం కాదు. ఎందుకంటే అన్ని కోర్సుల మాదిరిగానే కామర్స్ కూడా లెక్కలపై పట్టుంటే తేలిగ్గా అధిగమించవచ్చు. మొదట్లో సబ్జెక్టు కొత్తగా అనిపించినా దానిపై ఇష్టాన్ని పెంచు కుంటే ప్రతి క్లాసూ కొత్తగా అనిపిస్తుంది. ఏదో ఒక డిగ్రీ చదివితే ఉద్యోగాలు వచ్చే రోజులుపోయాయి. మారుతున్న మార్కెటింగ్, వ్యాపారలావాదేవీల అవసరాలకు అనుగుణంగా వస్తున్న మార్పులు కామర్స్ కోర్సులో కనిపిస్తుంది. ఆ మార్పును ఆస్వాదిస్తూ చదవటం అలవాటు చేసుకున్నా. దీంతో ‘సీఏ’ ఒకేసారి పూర్తిచేయగలననే నమ్మకం కలిగింది.
కష్టపడితే ర్యాంకు సాధ్యమే
‘సీఏ’ పూర్తిచేయాలని విద్యార్థులు ఎంతగానో తపనపడతారు. కానీ ఉత్తీర్ణత శాతం మాత్రం చాలాచాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం పరీక్షల ముందు చదవటమే. నేను ఇంటర్‌లో చేరిన మొదటిరోజు నుంచి సబ్జెక్టులపై పట్టుతెచ్చుకునేలా చదివాను. సీపీటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పరీక్షలో అకౌంటెంట్స్, మర్కంటైల్‌లా, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలుంటాయి. నాకు మ్యాథ్స్, కామర్స్‌లో మంచి మార్కులు వచ్చాయి. కాలేజీలో రోజువారీ పరీక్షలు నిర్వహించేవారు. వాటిలో మార్కులు తగ్గినా.. సబ్జెక్టులో సందేహాలను తీర్చేందుకు అధ్యాపకులు సహకరించేవారు. లెక్కలంటే ఇష్టపడే విద్యార్థులు కొద్దిగా శ్రద్ధపెడితే మంచిస్కోరు చేయవచ్చు.
ఐఐఎంలో ఎంబీయే లక్ష్యం
ఒకే దఫా సీఏ పాసవ్వాలి. డిగ్రీ చేతికిరాగానే అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీయే చేయాలన్నది లక్ష్యం. మంచి ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా తప్పుడు లెక్కలు వేయకుండా నిజాయితీగా పనిచేయాలనుంది. దేశానికి ఉపయోగపడేలా ఆర్థిక నిపుణుడిగా నా వంతు తోడ్పాటును అందించాలనుంది.
ఆరేళ్లు కష్టపడేలా సిద్ధమవ్వండి
ఇంటర్ తర్వాత సీఏ కోర్సు మంచి ఛాయిస్.ఆరేళ్లు కష్టపడగలమనే ధైర్యంతో రావాలి. పరీక్షల ముందు నెలరోజులు చదివితే చాలనుకుంటే పొరపాటే. క్లిష్టమైన సబ్జెక్టులు, తక్కువగా ఉండే ఉత్తీర్ణత శాతం గుర్తుంచుకోండి. కోర్సులో చేరిన మొదటిరోజు నుంచే రోజూ నాలుగైదు గంటలు కేటాయిస్తూ పాఠ్యాంశాలను ఆస్వాదిస్తూ చదివితే విజయం సాధించటం చాలా తేలిక అనేది నా సలహా.

Published date : 18 Jul 2013 04:27PM