యూజీ, పీజీ కాలేజీలకు కొత్త నిబంధనలు జారీ చేసిన ఉన్నత విద్యామండలి
Sakshi Education
సాక్షి, అమరావతి: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించే ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేటు కాలేజీలకు అనుమతులపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త నిబంధనలను విధించింది.
ప్రస్తుతమున్న నిబంధనలకు మరికొన్ని నిబంధనలను జోడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కోర్సులు ప్రారంభించాలన్నా, కొత్తగా అదనపు సెక్షన్లను ఏర్పాటు చేయాలన్నా ఆయా కాలేజీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
ప్రస్తుత నిబంధనలకు అదనంగా చేర్చిన అంశాలు:
ప్రస్తుత నిబంధనలకు అదనంగా చేర్చిన అంశాలు:
- 2020-21 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సులు, సెక్షన్ల కోసం దరఖాస్తు చేసే డిగ్రీ కాలేజీలకు 2019-20లో మొత్తం మంజూరైన సీట్లలో 50 శాతం అడ్మిషన్లు ఉండాలి.
- దీంతోపాటు 2018-19లో మొత్తం విద్యార్థుల్లో 75 శాతం మంది పరీక్షలకు హాజరై ఉండాలి.
- యూజీ కోర్సులను బోధించే సిబ్బందిలో 50 శాతం మంది పీజీ పూర్తిచేసి నెట్ లేదా సెట్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.
- పీజీ కోర్సులకైతే అడ్మిషన్లు, పరీక్షలకు విద్యార్థుల హాజరు నిబంధనలతోపాటు బోధన సిబ్బందిలో అందరూ నిర్ణీత అర్హతలు పూర్తిగా కలిగి ఉండాలి.
- ప్రతి కళాశాల తప్పనిసరిగా వెబ్‌సైట్ నిర్వహించడంతోపాటు అందులో విద్యార్థులు, టీచర్లు, వారి అర్హతలు, ఫీజులు, సంస్థలోని సదుపాయాలు, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుండాలి.
- పదేళ్లకు పైబడి లీజు భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలు అనుమతుల పునరుద్ధరణ, కొత్త కోర్సులకు దరఖాస్తు చేసే అవకాశం లేదు.
- పీజీ కళాశాలలకు సొంత భవనాలు ఉండాల్సిందే.
Published date : 13 Feb 2020 01:28PM